Share News

Jagan Vs Sharmila: అన్నింటికి అమ్మే సాక్షి

ABN , Publish Date - Oct 23 , 2024 | 10:17 PM

సొంత అన్నా చెల్లెలు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య రాజకీయ వైరమే కాదు.. ఆస్తి తగదాలు సైతం ఉన్నాయన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే కన్న తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉండగా సొదరికి ఆస్తిలో వాటా ఇస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. ఆయన ఆకస్మిక మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట తప్పారు.

Jagan Vs Sharmila: అన్నింటికి అమ్మే సాక్షి

చరిత్రలో ఏ పురాణం చూసినా, ప్రపంచంలో ఏ జీవిని చూసినా.. కన్నతల్లి తరువాతే ఏదైనా. జంతువులు సైతం కన్నతల్లి అంటే అమితమైన ప్రేమ. కానీ ప్రస్తుత మీరు చూడబోయే ఈ కన్నీటి లేఖ చూస్తే.. జంతువుల కంటే ఘోరంగా ప్రవర్తించే ఒక వింత సైకో గురించి తెలుసుకుంటారు. ఇంటి ఆడ బిడ్డకు ఆస్తి ఇవ్వకుండా జగన్ రెడ్డి అనే సైకో ఎలా వేధిస్తున్నాడో చూస్తారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇచ్చిన మాటను ఈ సైకో ఎలా తప్పాడో చెబుతూ కన్నీళ్ళతో చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ సైకో జగన్‌కి లేఖ రాశారు. ఈ లేఖలో తల్లి విజయమ్మ సైతం సంతకం పెట్టారు.


sharmila.jpg

ఇలాంటి సైకోలు రాజకీయాల్లో ఉంటే.. మన సమాజంలో ఉంటే.. ఎంత ప్రమాదమో చెప్పటానికి.. ఈ లేఖని ప్రజల్లో తీసుకు వెళ్తున్నాం. ఈ లేఖలో మొత్తం ఎనిమిది అంశాలున్నాయి. వాటిలో.. ఏడో అంశం పరిశీలిస్తే.. జగన్ అనే వాడు రాజకీయంగా ఎంత పిరికివాడో తెలుస్తుంది. ఒక తల్లి, ఒక చెల్లి కలిసి కన్నీళ్లతో.. ఓ సైకోకి రాసిన లేఖలోని మొదటి భాగం "మీరు ఇటీవల నాకు పంపిన లేఖపై నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను.


దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కుటుంబ వనరుల ద్వారా సంపాదించిన ఆస్తులన్నింటినీ తన నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలని నిర్ద్వంద్వంగా ఆదేశించిన విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మీరు ఆ షరతుకి అంగీకరిస్తున్నానని ఆ సమయంలో మాకు హామీ కూడా ఇచ్చారు. కానీ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం మీరు ఆ షరతుకి నేను ఒప్పుకోనంటూ నిరాకరించారు.


భారతి సిమెంట్స్‌, సాక్షి ఇలా తన జీవిత కాలంలో రాజశేఖర్ రెడ్డి గారు సంపాదించిన ఆస్తులన్నీ తన నలుగురు మనవళ్లకు సమానంగా పంచుకోవాలని ఆనాడే నిర్ద్వంద్వంగా చెప్పారు. వీటన్నిటికీ మన అమ్మ సాక్షి మాత్రమే కాదు మన మధ్య జరిగిన పరస్పర ఒప్పందాలన్నీ ఆమె గమనించింది కూడా."


సొంత అన్నా చెల్లెలు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య రాజకీయ వైరమే కాదు.. ఆస్తి తగదాలు సైతం ఉన్నాయన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే కన్న తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉండగా సొదరికి ఆస్తిలో వాటా ఇస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. ఆయన ఆకస్మిక మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట తప్పారు.


మడమ తిప్పారు. ఆ క్రమంలో నాడు చేసుకున్న బాసలు నీటి మీద రాతలని సోదరి వైఎస్ షర్మిలకు కాలక్రమేణ అర్థమైంది. అలా సొంత సోదరుడుకి ఆమె దూరం జరిగింది. దీంతో తన ఆస్తి వాటపై సోదరుడికి వైఎస్ షర్మిల లేఖ రాసింది. ఆ లేఖలోని అంశాలను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవి వైరల్‌గా మారాయి.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Oct 23 , 2024 | 10:17 PM