AP Elections: వైసీపీలో అలజడి.. !
ABN , Publish Date - May 13 , 2024 | 09:32 PM
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఇతర రాష్ట్రాల్లోని ఏపీ ఓటర్లంతా స్వస్థలాలకు పోటెత్తారు. అదీ కూడా దసరా, సంక్రాంతి పండగ వేళన్నట్లుగా.. మే 13వ తేదీకి ఒక రోజు ముందే ఓటర్లలంతా సొంతూళ్లకు పయనమయ్యారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఇతర రాష్ట్రాల్లోని ఏపీ ఓటర్లంతా స్వస్థలాలకు పోటెత్తారు. అదీ కూడా దసరా, సంక్రాంతి పండగ వేళన్నట్లుగా.. మే 13వ తేదీకి ఒక రోజు ముందే ఓటర్లలంతా సొంతూళ్లకు పయనమయ్యారు. అయితే గతంలో ఎన్నికల సమయంలో మాదిరిగా కాకుండా ఇంత వెల్లువలా వెళ్లడం వెనుక ఉన్న కారణాలు ఏమై ఉంటాయనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్ట్ సాక్షిగా వైయస్ జగన్‌పై కోడికత్తి దాడి జరిగింది. అనంతరం పులివెందుల్లో జగన్ సొంత చిన్నాన్న వైయస్ వివేకా దారుణ హత్యకు గురయ్యారు. ఈ మకిలిని నాటి అధికార టీడీపీకి అంటించడం ద్వారా .. తన రాజకీయ పరద పదసోపాన పటంలో ‘వాటిని’ నిచ్చెనలా వాడుకొన్నారీ వైయస్ జగన్. తద్వారా నాటి ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకొని రికార్డు సృష్టించారు.
LoKSabha Elections: పోలింగ్ బహిష్కరించిన పలు గ్రామాల ప్రజలు
అలా అధికార పీఠమెక్కారీ జగన్... ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి రాగానే గాలికి వదిలేశారు. అవి.. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు, మద్య పాన నిషేధం, ప్రతీ ఏటా యువతకు జ్యాబ్ క్యాలెండర్, రాజధాని అమరావతి కాదని మూడు రాజధానులు తెర మీదకు తీసుకు వచ్చారు.
High Tension in Gannavaram: యార్లగడ్డ వెంకట్రావుపై వంశీ అనుచరులు దాడి
ఈ అయిదేళ్ల జగన్ పాలనపై ముఖ్యమంత్రిగా ఆయన పాలన వైఖరిపై ఆంధ్రా ఓటర్లలలో ఓ బలమైన అభిప్రాయమైతే వచ్చిందనేది సుస్పష్టం. అందుకే సోమవారం ఉదయం 7.00 గంటలకు మొదలైన పోలింగ్..రాత్రి 10.00 గంటల వరకు జరిగిందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.
ఈ సారి ఈ ఎన్నికల్లో పోలింగ్‌లో ఓటింగ్ శాతం సైతం గణనీయంగా పెరిగింది. ఈ విషయాన్ని అధికార వైసీపీ నేతలు ముందుగానే గ్రహించారు. అందుకే పోలింగ్ కేంద్రాల సాక్షిగా అధికార పార్టీ వారు తొక్కిన చిందులు.. ఎందుకన్నది ఓటర్లకు ఇప్పటికే బాగా అర్థమైంది. ఏదీ ఏమైనా ఈ ఎన్నికల్లో ఓటరు మాత్రం పక్కా క్లారిటీతో ఉన్నాడు. అది అధికార వైసీపీకి తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాలి.
Read Latest National News And Telugu News