బడులపై క్షేత్రస్థాయి అధ్యయనం
ABN , Publish Date - Dec 03 , 2024 | 04:50 AM
వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వివాదాస్పద జీవో 117కు ప్రత్యామ్నాయంగా వేరొక జీవోను తీసుకొచ్చే ప్రక్రియ ను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది.
రెండు నెలల్లో జీవో 117కు ప్రత్యామ్నాయం
నెల రోజుల్లో ఉపాధ్యాయ బదిలీల చట్టం
అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వివాదాస్పద జీవో 117కు ప్రత్యామ్నాయంగా వేరొక జీవోను తీసుకొచ్చే ప్రక్రియ ను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. ఆ జీవో ను రద్దుచేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోగా, దాని స్థానంలో మరో జీవోపై అధ్యయనం చేయనుం ది. దీనికి పాఠశాల విద్యాశాఖ వారం రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వనుంది. వాటి ప్రకారం ప్రతి గ్రామానికీ వెళ్లి అక్కడ పాఠశాలలో ఎంత మంది విద్యార్థులున్నా రు, ఎంతమంది టీచర్లు అవసరం అనేది అంచనా వేస్తారు. అలా రాష్ట్రవ్యాప్తంగా అధ్యయనం చేసి 2 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త జీవో అమల్లోకి వస్తుం ది. అలాగే ఉపాధ్యాయ బదిలీలకు చట్టం తేవాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. దానిని కూడా నెల రోజుల్లో కొలిక్కి తీసుకురానుంది. ఇప్పటికే ఇతర రాష్ర్టాల్లో టీచర్ల బదిలీల చట్టాలను అధికారులు అధ్యయనం చేశారు. టీచర్ల నుంచి కూడా అభిప్రాయాలు స్వీకరించి చట్టం తేవాలని యోచిస్తోంది. చట్టం తెస్తే ఇక బదిలీలకు అడ్డంకులు ఏర్పడవు. ప్రస్తుతం బదిలీల షెడ్యూలు జారీచేసిన వెంటనే కొందరు టీచర్లు కోర్టులకు వెళ్లడంతో ప్రక్రియ ఆగిపోతోంది.