Share News

Personal Finance: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీంలో రూ.10 లక్షలు పెడితే.. మీకు వడ్డీనే రూ. 20 లక్షలొస్తుంది తెలుసా..

ABN , Publish Date - Sep 24 , 2024 | 11:31 AM

బ్యాంకుల మాదిరిగానే, పోస్టాఫీసులో వివిధ రకాల FD స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఓ పోస్టాఫీస్ స్కీంలో మీరు కొంత పెట్టుబడి చేస్తే ఆ మొత్తం కంటే, మీకు వచ్చే వడ్డీ మూడు రెట్లు రావడం విశేషం. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. దీంతోపాటు మీరు ఆదాయపు పన్ను చట్టం కింద ప్రయోజనం కూడా పొందుతారు.

Personal Finance: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీంలో రూ.10 లక్షలు పెడితే.. మీకు వడ్డీనే రూ. 20 లక్షలొస్తుంది తెలుసా..
post office saving deposit scheme

రిస్క్ లేని రిటర్న్స్ కావాలంటే బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, ప్రభుత్వ రంగ స్కీంలలో పెట్టుబడులు బెస్ట్ అని చెప్పవచ్చు. వీటిలో మీ డబ్బుపై భద్రతతోపాటు మంచి ఆదాయం కూడా సమకూరుతుంది. అలాంటి పథకాలలో పోస్ట్ ఆఫీస్‌ టైమ్ డిపాజిట్ స్కీం(post office time deposit scheme) ఒకటి. దీనిని సాధారణ భాషలో పోస్ట్ ఆఫీస్ FD అని పిలుస్తారు. దీనిలో మీరు పెట్టిన సేవింగ్స్ కంటే మీకు వచ్చే వడ్డీ మూడు రెట్లు రావడం విశేషం. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.


ముందుగా

పోస్టాఫీసులో మీ మొత్తాన్ని మూడు రెట్లు పెంచుకోవడానికి మీరు ముందుగా 5 సంవత్సరాల FDని ఎంచుకోవాలి. మీరు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన తర్వాత మెచ్యూరిటీకి ముందు మరో ఐదేళ్ల పొడిగించుకోవాలి. మీరు ఈ పొడిగింపును వరుసగా రెండుసార్లు చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఈ FDని 15 సంవత్సరాల పాటు అమలు చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఈ FDలో రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే మీకు 7.5 శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాలలో ఆ మొత్తంపై మీకు రూ. 4,49,948 వడ్డీ లభిస్తుంది. ఈ విధంగా ఆ మొత్తం రూ.14,49,948 అవుతుంది.


పెట్టిన మొత్తంపై

ఆ తర్వాత మీరు ఈ పథకాన్ని 5 సంవత్సరాలు పొడిగిస్తే, 10 సంవత్సరాల తర్వాత మీకు వచ్చే మొత్తం మొత్తం రూ. 21,02,349 అవుతుంది. ఇది మెచ్యూర్ అయ్యే ముందు మీరు దాన్ని మరోసారి పొడిగించవలసి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో 15వ సంవత్సరంలో మీకు రూ.10 లక్షల పెట్టుబడిపై కేవలం వడ్డీ డబ్బులే రూ.20,48,297 వస్తాయి. ఆ క్రమంలో మీకు వచ్చే మొత్తం మెచ్యూరిటీపై రూ. 30,48,297 పొందుతారు. అంటే మీరు పెట్టిన మొత్తం 10 లక్షలు, కానీ మీకు వచ్చేది మాత్రం 30 లక్షలకుపైగా లభిస్తుంది. మీ మొత్తాన్ని మూడు రెట్లు పొందుతారు. అంతేకాదు మీరు ఆదాయపు పన్ను చట్టం 80C కింద పన్ను ప్రయోజనం కూడా పొందుతారు.


పొడిగింపు

పోస్ట్ ఆఫీస్ ఒక సంవత్సరం FD మెచ్యూరిటీ తేదీ నుంచి 6 నెలలలోపు, 2 సంవత్సరాల FD మెచ్యూరిటీ వ్యవధిలో 12 నెలలలోపు, 3, 5 సంవత్సరాల FD మెచ్యూరిటీ వ్యవధిలో 18 నెలలలోపు పొడిగించబడుతుంది. ఇది కాకుండా ఖాతాను తెరిచేటప్పుడు మీరు మెచ్యూరిటీ తర్వాత ఖాతా పొడిగింపు కోసం కూడా అభ్యర్థించవచ్చు. మెచ్యూరిటీ తేదీలో సంబంధిత ఖాతాకు వర్తించే వడ్డీ రేటు పొడిగించిన వ్యవధిలో వర్తిస్తుంది.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Customers: జియో, ఎయిర్ టెల్, వీఐలకు షాకిచ్చిన కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్‌కు లాభం

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

Read More Business News and Latest Telugu News

Updated Date - Sep 24 , 2024 | 11:33 AM