Share News

5 రోజుల్లో రూ.16 లక్షల కోట్లు ఉఫ్‌

ABN , Publish Date - Oct 05 , 2024 | 03:27 AM

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడులు (ఎఫ్‌ఐఐ) చైనా కు తరలిపోతుండటం, ముడి చమురు ధరలు మళ్లీ ఎగబాకుతుండటంతో భారత స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోయింది.

   5 రోజుల్లో రూ.16 లక్షల కోట్లు  ఉఫ్‌

  • దాదాపు 5% క్షీణించిన సెన్సెక్స్‌

  • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఎఫ్‌ఐఐల యూటర్నే కారణం

ముంబై: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడులు (ఎఫ్‌ఐఐ) చైనా కు తరలిపోతుండటం, ముడి చమురు ధరలు మళ్లీ ఎగబాకుతుండటంతో భారత స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోయింది. గడిచిన ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో బీఎస్‌ ఈ ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌ 4,147.67 పాయింట్లు (4.83ు), నిఫ్టీ 1,201 పాయింట్లు (4.65%) క్షీణించాయి. దాంతో ఈక్విటీ మదుపరుల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఐదు రోజుల్లో రూ.16.26 లక్షల కోట్లు పతనమై రూ.460.89 లక్షల కోట్లకు (5.49 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. ఈ వారాంతం సెషన్‌లో మార్కెట్‌ క్యాప్‌ రూ.4.18 లక్షల కోట్ల మేర తగ్గగా.. గురువారం ఏకంగా రూ.9.78 లక్షల కోట్లు క్షీణించింది. మార్కెట్‌ స్వల్పకాలం పాటు బేరిష్‌ ట్రెండ్‌లోనే కొనసాగవచ్చని ఈక్విటీ నిపుణులు భావిస్తున్నారు.


  • వారాంతంలో సెన్సెక్స్‌ 809 పాయింట్లు డౌన్‌

ప్రామాణిక ఈక్విటీ సూచీలు శుక్రవారం ఆద్యంతం తీవ్ర ఊగిసలాటలకు లోనయ్యాయి. ఆరంభంలో స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ ఆరంభించిన సెన్సెక్స్‌.. త్వరగానే కోలుకుని మళ్లీ లాభాల్లోకి మళ్లింది. ఒక దశలో సూచీ 871 పాయింట్ల వరకు పెరిగి 83,368 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. కానీ, సూచీ మళ్లీ యూటర్న్‌ తీసుకుంది. మధ్యాహ్నం నుంచి అమ్మకాలు పోటెత్తడంతో తిరిగి నష్టాలోకి జారుకుంది. ఒక దశలో 965 పాయింట్లు కోల్పోయి 81,532 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సెన్సెక్స్‌ 808.65 పాయింట్ల నష్టంతో 81,688.45 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సూచీ 1,835.64 పాయింట్ల శ్రేణిలో కదలాడింది. నిఫ్టీ విషయానికొస్తే.. 235.50 పాయింట్లు కోల్పోయి 25,014.60 వద్దకు జారుకుంది. ఒక దశలో సూచీ 25,485.05 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని, 24,966.80 వద్ద కనిషాన్ని నమోదు చేసింది.

  • ఈ వారంలో జరిగిన నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 3,883.4 పాయింట్లు (4.6ు), నిఫ్టీ 1,164.35 పాయింట్లు (4.5ు) తగ్గాయి. గడిచిన రెండేళ్లలో మార్కెట్‌కు ఇదే అత్యంత గడ్డు వారం.

  • సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 24 నష్టపోగా.. ఎం అండ్‌ ఎం షేరు అత్యధికంగా 3.58 శాతం క్షీణించింది. మార్కెట్‌ దిగ్గజాలైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ షేర్లు 1.5 శాతం మేర తగ్గాయి.

Updated Date - Oct 05 , 2024 | 03:27 AM