Karan Johar: కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్‌లో పూనావాలాకు 50% వాటా.. డీల్ విలువ ఎన్ని కోట్లంటే..
ABN , Publish Date - Oct 21 , 2024 | 05:45 PM
బిలియనీర్, వ్యాపారవేత్త అదార్ పూనావాలా, కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్‌లో 50% వాటాను కొనుగోలు చేశారు. పూనావాలా సంస్థ సెరీన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ వాటాను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అయితే ఈ డీల్ విలువ ఎంత వంటి వివరాలను ఇక్కడ చుద్దాం.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్(Karan Johar) తన నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్‌లో 50% వాటాను అదార్ పూనావలాకు(Adar Poonawalla) విక్రయించాడు. గత కొన్ని రోజులుగా ధర్మా తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ క్రమంలో జియో, Saregama వంటి పేర్లు వెలుగులోకి వచ్చాయి. కానీ ఈ డీల్‌లో సీరమ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన అదార్ పూనావాలా పేరు చివరకు చేరింది. ధర్మా ప్రొడక్షన్స్ దాని డిజిటల్ వింగ్ ధర్మాటిక్‌లో సగం వాటాను కొనుగోలు చేయడానికి ఆదార్ రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. అదార్ తన నిర్మాణ సంస్థ సెరీన్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ పెట్టుబడి పెట్టారు.
కరోనా తర్వాత
ఈ పెట్టుబడి ద్వారా సెరీన్ ప్రొడక్షన్స్ ధర్మాలో 50% వాటాను కలిగి ఉంటుంది. మిగిలిన 50% కరణ్ జోహార్ కలిగి ఉంటారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా, కరణ్ జోహార్ కంపెనీకి నాయకత్వం వహిస్తారు. అపూర్వ మెహతా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా కరణ్‌తో కలిసి పని చేస్తారు. ధర్మా ప్రొడక్షన్స్‌లో కరణ్ జోహార్ ఇదివరకు 90.7% వాటాను కలిగి ఉన్నారు. ఆయన తల్లి హిరు జోహార్‌కు 9.24% వాటా ఉంది. ఫోర్బ్స్ ఇండియాలో ప్రచురించిన డేటా ప్రకారం ఇది సినిమా పరిశ్రమకు సంబంధించినది. కరోనా కాలం నుంచి సినిమా పరిశ్రమ పరిస్థితి మరింత దిగజారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పరిశ్రమలో భాగస్వామ్యం అవసరమని ఆయన భావించారు. ఈ డీల్ నేపథ్యంలో భారీ స్థాయి బడ్జెట్‌తో మరిన్ని చిత్రాలను ప్లాన్ చేయనున్నారు.
నెటిజన్లు కామెంట్లు
ఈ డీల్‌తో పూనావాలా ఇప్పుడు ధర్మ ప్రొడక్షన్స్‌కు సహ యజమానిగా మారారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కరణ్ జోహార్ కొనసాగుతుండగా, అపూర్వ మెహతా సీఈవోగా కొనసాగనున్నారు. ఈ పెద్ద ప్రకటన తర్వాత నెటిజన్లు సోషల్ మీడియాలో ఫన్నీ రియాక్షన్లు ఇస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ద్వారా వచ్చిన డబ్బుతో ఇప్పుడు 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 3' రూపొందుతుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం దీనిని 'బాలీవుడ్‌కు బూస్టర్ షాట్' అని పేర్కొన్నారు. అదార్ పూనావాలా భార్య నటాషా పూనావాలా కరణ్ జోహార్‌కు సన్నిహితురాలు అని మరికొంత మంది కామెంట్లు చేశారు.
అదార్ పూనావాలా ఎవరు?
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ కంపెనీ అయిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)కి అదార్ పూనావాలా భారతీయ వ్యవస్థాపకుడు, CEOగా ఉన్నారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను 1966లో ఆయన తండ్రి సైరస్ పూనావల్ల స్థాపించారు. దీని ద్వారా నేడు ప్రపంచవ్యాప్తంగా వివిధ వ్యాధులకు వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేస్తున్నారు. అదార్ పూనావాలా 2011లో సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించి కంపెనీని కొత్త స్థాయికి తీసుకెళ్లారు. కరోనా సమయంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ (కోవిషీల్డ్)ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసింది. దీని కారణంగా పూనావాలా కంపెనీ పేరు ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది.
ఇవి కూడా చదవండి:
Business Idea: జస్ట్ రూ.10 వేల పెట్టుబడితో వ్యాపారం.. నెలకు రూ. 50 వేలకుపైగా ఆదాయం..
Pension Plan: రోజూ రూ. 12 ఆదా చేస్తే.. 60 ఏళ్ల తర్వాత నెలకు ఎంత పెన్షన్ వస్తుందంటే..
Muhurat Trading 2024: ఈసారి దీపావళి ముహూరత్ ట్రేడింగ్ ఎప్పుడంటే.. అక్టోబర్ 31 లేదా నవంబర్ 1..
Missed Call: మీ బ్యాంక్ బ్యాలెన్స్ మిస్డ్ కాల్ ఇచ్చి ఇలా చెక్ చేసుకోండి..
Personal Finance: మహిళలకు గుడ్ న్యూస్.. రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Read More Business News and Latest Telugu News