Stock Market: బడ్జెట్ ఎఫెక్ట్.. ఆ షేర్లన్నీ ఢమాల్..
ABN , Publish Date - Jul 23 , 2024 | 10:52 AM
ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్2024ను ప్రవేశ పెట్టబోతున్నారు. ఈ క్రమంలోనే ముందస్తు అంచనాలు స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తాయన్న విషయం తెలిసిందే.
ముంబై: ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్2024ను ప్రవేశ పెట్టబోతున్నారు. ఈ క్రమంలోనే ముందస్తు అంచనాలు స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తాయన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే జరుగుతోంది. పన్ను మినహాయింపులు, ఉద్యోగ కల్పన వంటి అంశాల్లో తలెత్తుతున్న అంచనాల నడుమ భారత ఈక్విటీలు చాలా జాగ్రత్తగా ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ ఉదయం స్టాక్ మార్కెట్ ప్రారంభ సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 250 పాయింట్లకు పైగా పెరిగింది కానీ లాభాలు మాత్రం తుడిచిపెట్టుకుపోయాయి. నిఫ్టీ కూడా నష్టాల్లోనే కొనసాగుతోంది.
నిన్న సెన్సెక్స్ 80,502.08 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ బెంచ్‌మార్క్ 23,537.85 వద్ద ముగిసింది. మధ్యతరగతి వర్గాలకు పన్ను రాయితీలు, ఉద్యోగాల కల్పన చర్యలు మార్కెట్లకు మాంచి ఊపు ఇచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఎన్‌టీపీసీ, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. బాగా నష్టపోయిన వాటిలో జేఎస్‌డబ్ల్యు స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా విప్రో, హెచ్‌సీఎల్‌టెక్, టెక్ మహీంద్రా వంటి ఐటీ షేర్లు కూడా నష్టాల బాటలోనే పయనిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ సెక్టార్ నియామకాలు గణనీయంగా తగ్గిపోయాయని నిన్న విడుదల చేసిన ప్రీ-బడ్జెట్ ఎకనామిక్ సర్వే పేర్కొంది. ప్రస్తుతం అది పుంజుకున్నా కూడా నామమాత్రమే అని తెలుస్తోంది. ఈ క్రమంలో ఐటీ షేర్లన్నీ నష్టాల బాటలో నడుస్తున్నాయి.
మార్కెట్ పరిశీలకులు ఎల్‌టీసీజీ పన్నులో ట్వీక్‌లను నిశితంగా గమనిస్తూ ఉంటారని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఎల్‌టీసీజీ పన్నులో ఎటువంటి మార్పులు లేకుంటే ఇబ్బంది లేదని.. ఒకరకంగా అది మార్కెట్‌కు పెద్ద ఉపశమనం కలిగిస్తుందంటున్నారు. పైగా మార్కెట్ సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
అందరి చూపు బడ్జెట్‌వైపు.. సామాన్యుడి ఆశలు చిగురించేనా..!
వికసిత్ భారత్‌కు ఆరంచెల వ్యూహం ఈ ఏడాది వృద్ధి 6.5%
For more Business News and Telugu News