Share News

Anand Mahindra: ఈయన దేన్ని టచ్ చేసినా బంగారమే: ఆనంద్ మహీంద్రా

ABN , Publish Date - Feb 25 , 2024 | 06:19 PM

భారత పర్యటనలో ఉన్న ఉబర్ సీఈఓ దారా ఖోస్రోషాహీని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మర్యాదపూర్వకంగా కలిశారు.

Anand Mahindra: ఈయన దేన్ని టచ్ చేసినా బంగారమే: ఆనంద్ మహీంద్రా

ఇంటర్నెట్ డెస్క్: భారత పర్యటనలో ఉన్న ఉబర్ (Uber) సీఈఓ దారా ఖోస్రోషాహీని (Dara Khosrowshahi) ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సమావేశం గురించి పలు విషయాలు పంచుకున్న ఆనంద్ మహీంద్రా..ఉబర్ సీఈఓపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన దేన్ని టచ్ చేసినా బంగారమే అంటూ కామెంట్ చేశారు.

IPOS Next Week: వచ్చే వారం వచ్చేస్తున్న 6 IPOలు.. మీరు సిద్ధమేనా?

ఉబర్ సీఈఓ‌గా దారా తొలుత నియమితులైనప్పుడు తనకు మదిలో ఎన్నో సందేహాలు కలిగాయని ఆనంద్‌మహీంద్రా అన్నారు. ఆయన సీఈఓ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లల్లో దావోస్‌లో కలిసినట్టు చెప్పుకొచ్చారు. అప్పట్లో తనకు ఆయన ఎక్కువ కాలం సీఈఓగా ఉండలేరని అనిపించినట్టు చెప్పుకొచ్చారు. అసలు ఉబర్ గడ్డుపరిస్థితుల నుంచి గట్టెక్కుతుందా అన్న సందేహం కూడా ఉండేదని తెలిపారు.


అయితే, నిజమైన నాయకుల గొప్ప లక్షణాలను కాలం తనదైన శైలిలో ఆవిష్కరిస్తుందని వ్యాఖ్యానించారు. ‘‘ఈ రోజు ఉబర్ మంచి లాభాలు కళ్లచూస్తోంది. సంస్థ కార్పొరేట్ సంస్కృతిలో ఇప్పుడు మరింత క్రమశిక్షణ, పొదుపు కనిపిస్తున్నాయి. ఉబర్ మార్కెట్ విలువ 170 బిలియన్ డాలర్లు ఉంది. దారా ఏది టచ్ చేసిన బంగారమయ్యేలాగా కనిపిస్తోంది. ఆయనను మరోసారి కలిసే అవకాశం రావడం నిజంగా సంతోషకరం’’ అని ఆనంద్ మహీంద్రా కామెంట్ చేశారు.

నెటిజన్లు కూడా ఆనంద్ మహీంద్రా ఏకీభవించారు. దారా నాయకత్వంపై ప్రశ్నించారు. అయితే, సంక్షిష్టమైన భారత మార్కెట్లో దారా కొద్దిగా తడబాటుకు గురైనట్టు ఉన్నారని కూడా ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ ట్వీట్‌కు ఇప్పటివరకూ 1.78 లక్షల వ్యూస్ వచ్చాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 25 , 2024 | 06:25 PM