Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Viral Video: అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ కన్నీరు పెట్టుకున్న ముఖేష్ అంబానీ

ABN , Publish Date - Mar 03 , 2024 | 07:30 AM

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక నేపథ్యంలో ముకేశ్ అంబానీ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.

Viral Video: అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ కన్నీరు పెట్టుకున్న ముఖేష్ అంబానీ

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్(Anant Radhika Pre Wedding) కార్యక్రమాలు మార్చి 1న గుజరాత్‌లోని జామ్‌నగర్‌(jamnagar)లో చాలా కోలాహలంగా ప్రారంభమయ్యాయి. భారతదేశంతోపాటు విదేశాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. అయితే నిన్న రెండోరోజు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్‌లో భాగంగా అనంత్ అంబానీ(Anant Ambani) ప్రసంగానికి ముఖేష్ అంబానీ(Mukesh Ambani) భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న సమయంలో తనకు అండగా నిలిచిన తండ్రి ముఖేష్ అంబానీ, తల్లి నీతా అంబానీకి అనంత్ కృతజ్ఞతలు తెలిపారు.

అది విన్న ముఖేష్ అంబానీ భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక కన్నీరు పెట్టుకున్నారు. రాధికా మర్చంట్‌తో తన వివాహానికి ముందు జరిగిన వేడుకలో అనంత్ అంబానీ భావోద్వేగ ప్రసంగంలో మా నాన్న, అమ్మ ఎప్పుడూ తనకు అండగా నిలిచారని చెప్పారు. తాను ఏదైనా చేయాలని అనుకుంటే, అలా చేస్తానని వారు గ్రహించారని వెల్లడించారు.


అంతేకాదు అనంత్ అంబానీ తన ప్రసంగంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రాధిక మర్చంట్‌తో తన ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్వహించినందుకు తన తల్లి నీతా అంబానీ(nita ambani)కి ధన్యవాదాలు తెలిపారు. పెళ్లికి సిద్ధమయ్యేందుకు తన తల్లి నాలుగు నెలల పాటు ప్రతిరోజూ దాదాపు 18 గంటల పాటు శ్రమించిందని అనంత్ అంబానీ అన్నారు. అనంత్ అంబానీ, అతిథులను ఉద్దేశించి మమ్మా, మీరు చేసిన ప్రతిదానికీ ధన్యవాదాలు. ఇదంతా మా అమ్మ చేసింది, మరెవరో కాదు. గత నాలుగు నెలలుగా ఆమె 18 గంటలు పని చేసింది. అమ్మకు నేను చాలా కృతజ్ఞుడనని అనంత్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అనంత్ అంబానీ(Anant Ambani), రాధిక మర్చంట్(radhika merchant) ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో అనంత్ అంబానీ ప్రసంగం వీడియో కూడా వైరల్ అవుతోంది. ఆ సమయంలో అనంత్ ఈ ప్రసంగాన్ని విన్న అతని తండ్రి ముఖేష్ అంబానీ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకోవడం వీడియోలో చూడవచ్చు. రెండోరోజు వేడుకకు బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, టైగర్ ష్రాఫ్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: ప్రవాస టెకీలు చలో భారత్‌!

Updated Date - Mar 03 , 2024 | 07:30 AM