Stock Market: నాలుగున్నరేళ్లలో లక్షను రూ.29 లక్షలు చేసిన స్టాక్.. ఏకంగా 2818 శాతం గ్రోత్
ABN , Publish Date - Sep 18 , 2024 | 12:33 PM
గతంలో ఆర్థిక వివాదాల్లో ఉన్న అనిల్ అంబానీ కంపెనీ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో కొనసాగుతుంది. ఈ కంపెనీ స్టాక్ ధర పుంజుకోవడంతో దీనిలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులకు మంచి లాభాలు వచ్చాయి. అంతేకాదు ఈ కంపెనీలో నాలుగున్నరేళ్ల క్రితం లక్ష పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు 29 లక్షలు వచ్చాయి.
ప్రస్తుతం స్టా్క్ మార్కెట్(stock market)లో చాలా కంపెనీలు తమ ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన కంపెనీ రిలయన్స్ పవర్ కూడా దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మంచి లాభాలను అందించింది. అంతేకాదు దీనిలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులను ధనవంతులను చేసింది. అయితే ఎన్నేళ్లలో ధనవంతులయ్యేరనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా రిలయన్స్ పవర్ షేర్లు రాకెట్ లా దూసుకుపోతున్నాయి. అనిల్ అంబానీ కంపెనీ పవర్ షేర్లు బుధవారం(సెప్టెంబర్ 18న) 5 శాతం పెరిగి రూ.32.98కి చేరాయి.
అప్పులు లేవు
రిలయన్స్ పవర్‌కి సంబంధించి పెద్ద అప్‌డేట్ వచ్చిన నేపథ్యంలో ఈ షేర్లు పుంజుకున్నాయి. రిలయన్స్ పవర్ విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ (VIPL) లేదా పవర్ జనరేషన్ కంపెనీకి గ్యారెంటర్‌గా తన ఆర్థిక బాధ్యతను పూర్తిగా నిర్వర్తించినట్లు సెప్టెంబర్ 17న ప్రకటించింది. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్‌కు బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో ఎలాంటి అప్పులు లేవని స్పష్టం చేసింది. జూన్ 30, 2024 వరకు మొత్తం ప్రాతిపదికన కంపెనీ నికర విలువ రూ.11,155 కోట్లు అని కంపెనీ తెలిపింది. విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ తన అనుబంధ సంస్థ కాదని, రిలయన్స్ పవర్ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. CFM అసెట్ రీకన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కంపెనీ అన్ని వివాదాలను పరిష్కరించుకున్నట్లు వెల్లడించింది.
2818 శాతం పెరుగుదల
దీంతో సెప్టెంబర్ 18, 2024న ఈ కంపెనీ షేర్లు రూ.32.98కి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే గత నాలుగున్నరేళ్లలో రిలయన్స్ పవర్ షేర్లు 2818 శాతం పెరగడం విశేషం. అనిల్ అంబానీ కంపెనీ షేర్లు మార్చి 27, 2020న రూ.1.13గా ఉండేవి. కానీ ప్రస్తుతం సెప్టెంబర్ 18, 2024 నాటికి ఈ కంపెనీ షేరు ధర రూ.32.98కి చేరుకుంది. అంటే నాలుగున్నరేళ్లలోనే 2800 శాతానికిపైగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి మార్చి 27, 2020న రిలయన్స్ పవర్ షేర్లలో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి, తన పెట్టుబడి మొత్తాన్ని అలాగే ఉంచినట్లయితే షేర్ల ప్రస్తుత ధర రూ.32.98 ప్రకారం రూ. 29.18 లక్షలు వచ్చాయని చెప్పవచ్చు.
గరిష్టం
రిలయన్స్ పవర్ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి రూ.38.07కి చేరుకోగా, కంపెనీ షేర్లు 52 వారాల కనిష్ట స్థాయి రూ.15.53గా ఉంది. గతేడాదితో పోలిస్తే 73 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్ 18, 2023న ఈ కంపెనీ షేరు విలువ రూ. 19.07గా ఉండేది. ప్రస్తుతం రిలయన్స్ పవర్ షేర్ సెప్టెంబర్ 18, 2024న రూ.32.98కి చేరుకుంది. గత 6 నెలల్లో కంపెనీ షేర్లు 42 శాతం పెరిగాయి. ఈ కాలంలో కంపెనీ షేర్లు రూ.23.23 నుంచి రూ.33కి పెరిగాయి.
ఇవి కూడా చదవండి:
Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే
Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు
Insurance: ఇకపై సైబర్ స్కాంలకు కూడా ఇన్సూరెన్స్ .. రోజుకు ఎంతంటే..
Read MoreBusiness News and Latest Telugu News