Airtel: యూజర్లకు మళ్లీ షాకిచ్చిన ఎయిర్ టెల్
ABN , Publish Date - Jul 15 , 2024 | 11:12 AM
ఎయిర్‌టెల్(Airtel) వినియోగదారులకు మళ్లీ షాకింగ్ న్యూస్ వచ్చేసింది. కంపెనీ ఇటీవల తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను 11 నుంచి 12 శాతం పెంచగా, అవి జులై 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు ఎయిర్‌టెల్ తన మూడు డేటా ప్యాక్‌ల(data packs) ధరలను ఏకంగా రూ.60 పెంచేసింది.
ఎయిర్‌టెల్(Airtel) వినియోగదారులకు మళ్లీ షాకింగ్ న్యూస్ వచ్చేసింది. ఈ టెలికాం కంపెనీ తన 3 మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను మరోసారి పెంచింది. కంపెనీ ఇటీవల తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను 11 నుంచి 12 శాతం పెంచగా, అవి జులై 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు ఎయిర్‌టెల్ తన మూడు డేటా ప్యాక్‌ల(data packs) ధరలను ఏకంగా రూ. 60 పెంచేసింది.
దీంతో కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్ననే రేట్లు పెంచారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తరుణంలో మళ్లీ డేటా ప్యాక్ రేట్లు పెంచడం దారుణమని అంటున్నారు. ఈ క్రమంలో టెలికాం కంపెనీ ధరల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కస్టమర్లు కోరుతున్నారు.
పెరిగిన ధరలు
ఈ నిర్ణయం తర్వాత కంపెనీ రూ.181 ప్లాన్ ఇప్పుడు రూ.211కి అందుబాటులో ఉంటుంది. ఈ 30 రోజుల ప్లాన్‌లో వినియోగదారులు ప్రతిరోజూ 1 GB డేటాను పొందుతారు. ఇది కాకుండా రూ.60 పెరిగిన రీఛార్జ్ ప్లాన్ రూ.301 ప్లాన్ ఇప్పుడు రూ.361గా మారింది. దీంతోపాటు కంపెనీ 84 రోజుల ప్లాన్ రూ.509కి చేరుకుంది. గతంలో దీని ధర 455 రూపాయలు కలదు.
ఈ ప్లాన్‌ల రేట్లు కూడా..
గత నెలలో జియో తన రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎయిర్‌టెల్ కూడా తన ప్లాన్‌ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన రేట్లు జులై 3 నుంచి అమల్లోకి వచ్చాయి. వన్ ఇయర్ ప్లాన్ గురించి మాట్లాడితే ఇంతకుముందు దీని ధర రూ. 1799 ఉండగా, నేటి నుంచి దీని ధర రూ.3599కి పెరిగింది. ఇందులో వినియోగదారులు ప్రతిరోజూ 2 GB డేటాను పొందుతారు.
ఇవి కూడా చదవండి:
Airport: ఇకపై ఈ విమానాశ్రయంలో 24×7 మద్యం దుకాణం ఓపెన్
Investment Plan: నెలకు రూ.16 వేలు కడితే కోటీశ్వరులవ్వొచ్చు.. ఎలాగంటే..?
Warranty vs Guarantee: మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడా తెలుసా.. లేదంటే నష్టపోతారు జాగ్రత్త..!
For Latest News and Business News click here