Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు
ABN , Publish Date - Sep 10 , 2024 | 10:34 AM
చాలా మందికి వెంటనే డబ్బు అవసరమైతే ఎక్కడి నుండైనా లభించకపోతే వారు లోన్ యాప్స్‌ను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి క్రమంలో లోన్స్(loans) తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఇటివల కాలంలో ప్రతి అవసరానికి అనేక మంది లోన్ యాప్స్(loan apps) ద్వారా రుణాలు తీసుకోవడం ఎక్కువైంది. ప్రధానంగా మధ్య తరగతి ఉద్యోగులు, యవత ఇలాంటి రుణాలను ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఇలాంటి రుణాలు(loans) తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇవి పాటించకపోతే మీ సిబిల్ స్కోర్ దెబ్బతినడంతోపాటు మీరు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే అందుకోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం నియమాలు పాటించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రిజిస్టర్ అయ్యిందా
అన్నింటికంటే మొదటిది మీరు ఏ యాప్ నుంచి లోన్ తీసుకుంటున్నారో ఆ కంపెనీ లేదా సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)లో రిజిస్టర్ అయ్యిందా లేదా అనేది చెక్ చేయాలి. ఆ క్రమంలో ఎన్‌బీఎఫ్‌సీ లేదా ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ ఆర్‌బీఐలో రిజిస్టర్ అవ్వకపోతే మీరు దాని నుంచి రుణం తీసుకోవద్దు. రిజిస్టర్ కానీ సంస్థల్లో లోన్ తీసుకుంటే వాటి నుంచి మీకు తర్వాత వేధింపులు వచ్చే అవకాశం ఉంటుంది.
డౌన్‌లోడ్‌లను చూసి
కొన్ని సార్లు పలువురు లోన్ యాప్ డౌన్‌లోడ్‌లు బాగున్నాయని తీసుకుంటారు. ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే Google గత రెండేళ్లలో Play Store నుంచి దాదాపు 4700 అక్రమ రుణ యాప్‌లను తొలగించింది. వీటిలో లక్ష కంటే ఎక్కువ డౌన్‌లోడ్‌లను కలిగి ఉన్న యాప్‌లు దాదాపు డజనుకుపైగా ఉన్నాయి. 50 వేల డౌన్‌లోడ్‌లు కలిగిన 14 యాప్‌లు ఉండటం విశేషం. మీరు ఎక్కువ డౌన్‌లోడ్ అంశాన్ని చూసి ఉచ్చులో పడొద్దు.
కస్టమర్ సపోర్ట్
మీ లోన్‌కి సంబంధించి ఏదైనా సమస్యలు వస్తే కాల్ చేయడానికి లేదా మెయిల్ చేసేందుకు సౌకర్యాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. కస్టమర్ కేర్ సపోర్ట్ ఏ సమయంలో అందుబాటులో ఉంటుందో పరిశీలించాలి. లోన్స్ తీసుకున్న తర్వాత కంపెనీకి కస్టమర్ కేర్ లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఏదైనా ఫిన్‌టెక్ యాప్ లేదా సంస్థ నుంచి లోన్ తీసుకునే ముందు దానికి సంబంధించిన కస్టమర్ కేర్ నంబర్లను నిర్ధారించుకోండి. అంతేకాదు ఇచ్చిన నంబర్లు పనిచేస్తున్నాయో లేదా కూడా ఓసారి చెక్ చేయండి.
ఫిర్యాదు చేయాలి
ఇటివల పలు లోన్ యాప్స్ రుణాలు చెల్లించిన తర్వాత కూడా ఇంకా డబ్బులు చెల్లించాలని పలువురిని వేధింపులకు గురి చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆ క్రమంలో పలువురు యువకులు ఆత్మహత్య వరకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీకు పర్సనల్ లోన్ కావాలంటే ముందుగా మీరు ఆయా లోన్ యాప్స్ ఆర్బీఐ నుంచి గుర్తింపు పొందాయా లేదా అనేది తప్పక తనిఖీ చేయాలి. అయినప్పటికీ రిజిస్టరైన లేదా రిజిస్టర్ కానీ సంస్థల నుంచి మీకు వేధింపులు వస్తే భయాందోళన చెందకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
ఇవి కూడా చదవండి:
2027 నాటికి మస్క్ ట్రిలియనీర్?
Money Saving Plan: రిటైర్ మెంట్ వరకు రూ. 8 కోట్లు కావాలంటే.. నెలకు ఎంత సేవ్ చేయాలి..
Stock Market: ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది.. క్షీణిస్తుందా, పెరుగుతుందా..
Money Saving Tips: రోజు రూ.250 సేవ్ చేయండి.. ఇలా రూ.2 కోట్లు సంపాదించండి..
Read MoreBusiness News and Latest Telugu News