Share News

TATA Motors: కమర్షియల్ వాహనాలు కొనాలనుకునే వారికి బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు..

ABN , Publish Date - Mar 07 , 2024 | 09:56 PM

TATA Motors Price Hike: టాటా మోటార్స్ కీలక ప్రకటన చేసింది. కమర్షియల్ వాహనాలు కొనోగులు చేయాలనుకునే వారికి బిగ్ షాక్ ఇచ్చింది. ఏప్రిల్ నెల నుంచి భారత మార్కెట్‌లో(Indian Auto Market) తన కమర్షియల్ వెహికిల్స్(Commercial Vehicle) ధరలను పెంచుతున్నట్లు టాటా మోటార్స్(Tata Motors) ప్రకటించింది.

TATA Motors: కమర్షియల్ వాహనాలు కొనాలనుకునే వారికి బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు..
Tata Motors Commercial Vehicle

TATA Motors Price Hike: టాటా మోటార్స్ కీలక ప్రకటన చేసింది. కమర్షియల్ వాహనాలు కొనోగులు చేయాలనుకునే వారికి బిగ్ షాక్ ఇచ్చింది. ఏప్రిల్ నెల నుంచి భారత మార్కెట్‌లో(Indian Auto Market) తన కమర్షియల్ వెహికిల్స్(Commercial Vehicle) ధరలను పెంచుతున్నట్లు టాటా మోటార్స్(Tata Motors) ప్రకటించింది. ఇటీవలే ప్యాసింజర్ వెహికిల్స్ ధరలను పెంచిన టాటా మోటార్స్.. ఇప్పుడు కమర్షియల్ వాహనదాల ధరలను కూడా పెంచేసింది.

వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి దేశంలో తమ ఉత్పత్తుల ధరలను పెంచనున్నట్టు టాటా మోటార్స్‌కు చెందిన వాణిజ్య వాహన విభాగం వెల్లడించింది. మోడల్స్, వేరియంట్‌లను బట్టి తమ వాణిజ్య వాహనాల శ్రేణి ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే మోడల్స్, వేరియంట్‌లను బట్టి ధరల పెంపు మారవచ్చని కంపెనీ పేర్కొంది. ఇది మొత్తం కమిర్షియల్ వెహికిల్స్ పోర్ట్‌ఫోలియో అంతటా వర్తిస్తుందని స్పష్టం చేసింది కంపెనీ. ఇదిలాఉంటే.. ఇన్‌పుట్ ఖర్చులు పెరిగాయనే కారణంతో ఈ సంవత్సరం ప్రారంభంలోనే కంపెనీ తన ప్యాసింజర్ వెహికిల్స్ ధరలను భారీగా పెంచేసింది. ఇప్పుడు వాణిజ్య వాహనాల ధరలను పెంచుతూ ప్రకటన విడుదల చేసింది.

భారతీయ మార్కెట్లో టాటా మోటార్స్ కమర్షియల్ వెహికిల్స్‌లో తేలికపాటి, మధ్యస్థ, భారీ వాహనాలు ఉన్నాయి. ఈ మూడు మోడల్స్ పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ఆప్షన్స్‌తో ఉన్నాయి. కంపెనీ క్లీన్ అండ్ గ్రీన్ మొబిలిటీ సొల్యూషన్స్ కోసం హైడ్రోజన్ టెక్నాలజీలో కూడా భారీగా పెట్టుబడి పెడుతోంది. భారతదేశాన్ని గ్రీన్ హైడ్రోజన్, దాని సాంకేతికతకు గ్లోబల్ హబ్‌గా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కంపెనీ పని చేస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 07 , 2024 | 09:56 PM