Share News

Ram Mandir: రాములోరి ప్రాణ ప్రతిష్ఠ శుభ ముహూర్తాన.. దూసుకెళ్తున్న కంపెనీల షేర్లు

ABN , Publish Date - Jan 21 , 2024 | 08:40 AM

అయోధ్య(Ayodhya) బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ ఆలయ అభివృద్ధిలో భాగమైన కంపెనీల షేర్లు దూసుకెళ్తున్నాయి. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా చిన్న కంపెనీల షేర్లు సైతం అమాంతంగా పెరిగాయి.

Ram Mandir: రాములోరి ప్రాణ ప్రతిష్ఠ శుభ ముహూర్తాన.. దూసుకెళ్తున్న కంపెనీల షేర్లు

అయోధ్య: అయోధ్య(Ayodhya) బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ ఆలయ అభివృద్ధిలో భాగమైన కంపెనీల షేర్లు దూసుకెళ్తున్నాయి. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా చిన్న కంపెనీల షేర్లు సైతం అమాంతంగా పెరిగాయి. అయోధ్య సమీపంలో లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేసిన ప్రవేగ్ లిమిటెడ్, CCTV నిఘా నెట్‌వర్క్ కాంట్రాక్ట్ పొందిన అలైడ్ డిజిటల్ సర్వీసెస్ లిమిటెడ్ షేర్లు డిసెంబర్‌లో 55 శాతానికిపైగా పెరిగాయి. కామత్ హోటల్స్ ఇండియా లిమిటెడ్ షేర్లు దాదాపు 35 శాతం లాభపడ్డాయి.

ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో జనవరి 22న రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. పుణ్యక్షేత్రంగా, పర్యాటక ప్రాంత గమ్య స్థానంగా అయోధ్య మారనుంది. నూతన విమానాశ్రయం, పునరుద్ధరించిన రైల్వే స్టేషన్‌ను డిసెంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభించారు. నగరంలో హోటళ్ళు, బ్యాంకుల సంఖ్య కూడా పెరుగుతోంది. రామ మందిర నిర్మాణం, ఆలయ పరిసరాల సుందరీకరణ పనుల కాంట్రాక్ట్‌లు పొందిన కంపెనీలు ప్రస్తుతం షేర్ మార్కెట్లో ట్రెండింగ్‌లో నిలుస్తుండటంపట్ల కంపెనీల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jan 21 , 2024 | 08:45 AM