Share News

Bajaj Housing Finance IPO: బజాజ్ బ్లాక్‌బస్టర్.. 114 శాతం ప్రీమియంతో లిస్ట్ అయిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్..

ABN , Publish Date - Sep 16 , 2024 | 01:13 PM

ఊహించినట్టుగానే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ బ్లాక్‌బస్టర్ అయింది. ఈ రోజు (సోమవారం) స్టాక్ మార్కెట్లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చింది. మదుపర్లకు తొలి రోజే భారీ లాభాలను ఆర్జించిపెట్టింది. ఈ రోజు లిస్టింగ్‌కు వచ్చిన కంపెనీ 114 శాతం ప్రీమియంతో లిస్ట్ అయింది.

Bajaj Housing Finance IPO: బజాజ్ బ్లాక్‌బస్టర్.. 114 శాతం ప్రీమియంతో లిస్ట్ అయిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్..
Bajaj Housing Finance IPO

ఊహించినట్టుగానే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ బ్లాక్‌బస్టర్ అయింది. ఈ రోజు (సోమవారం) స్టాక్ మార్కెట్లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చింది. మదుపర్లకు తొలి రోజే భారీ లాభాలను ఆర్జించిపెట్టింది. ఈ రోజు లిస్టింగ్‌కు వచ్చిన కంపెనీ 114 శాతం ప్రీమియంతో లిస్ట్ అయింది. ప్రస్తుతం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 135 శాతం లాభంతో రూ. 165 వద్ద కొనసాగుతోంది. షేర్ ఇష్యూ ధర రూ.70 కాగా, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో రూ.150 వద్ద లిస్ట్ అయింది. ఈ లిస్టింగ్‌తో కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా రూ.1.07 లక్షల కోట్లకు చేరింది.


రూ.6, 560 కోట్లను మార్కెట్ నుంచి సమీకరించాలనే లక్ష్యంతో గత వారం ఈ ఐపీఓ ప్రారంభమైంది. ఈ ఐపీఓకు విశేష స్పందన లభించింది. తొలి రోజే ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఐపీఓలో భాగంగా రూ.3,560 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేశారు. అలాగే మాతృసంస్థ అయిన బజాజ్ ఫైనాన్స్ మరో రూ.3 వేల కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించింది. మొత్తం దాదాపు 72.75 కోట్ల షేర్లను అందుబాటులో ఉంచగా ఏకంగా 63.6 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. గత సోమవారం ప్రారంభమైన ఈ ఐపీఓ 11వ తేదీన పూర్తయింది.


కాగా, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1731 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందు ఏడాది లాభం (రూ.1258)తో పోలిస్తే 38 శాతం వృద్ధిని నమోదు చేసింది. కొత్తగా ఇల్లు కొనుగోలు చేసే వారితో పాటు గృహాలు, కమర్షియల్ ప్రాపర్టీలు పునరుద్ధరణ కోసం ఈ సంస్థ రుణాలు ఇస్తూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే


Next Week IPOs: ఈ వారం మార్కెట్లోకి రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్నంటే..

Insurance: ఇకపై సైబర్ స్కాంలకు కూడా ఇన్సూరెన్స్ .. రోజుకు ఎంతంటే..

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 16 , 2024 | 01:13 PM