Share News

Muharram Bank Holiday: నేడు ఈ ప్రాంతాల్లో మాత్రమే బ్యాంకు హాలిడే

ABN , Publish Date - Jul 17 , 2024 | 10:13 AM

నేడు (జులై 17న) ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం పండుగ (Muharram festival). దీనిని ప్రతి సంవత్సరం వేర్వేరు తేదీలలో జరుపుకుంటారు. అయితే ఈ పండుగ సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో మాత్రం బ్యాంకులకు హాలిడే లేదనే విషయం తెలుసుకోవాలి.

Muharram Bank Holiday: నేడు ఈ ప్రాంతాల్లో మాత్రమే బ్యాంకు హాలిడే
Muharram Bank holiday

నేడు (జులై 17న) ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం పండుగ (Muharram festival). దీనిని ప్రతి సంవత్సరం వేర్వేరు తేదీలలో జరుపుకుంటారు. అయితే ఈరోజు వచ్చిన పండుగను అనేక రాష్ట్రాల్లో జరుపుకుంటారు. ఈ క్రమంలో స్కూళ్లతోపాటు బ్యాంకులకు కూడా సెలవు ప్రకటించారు. అయితే ఈ పండుగ సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో మాత్రం బ్యాంకులకు హాలిడే(bank holiday) లేదనే విషయం తెలుసుకోవాలి. అయితే ప్రధానంగా ఏయే ప్రాంతాల్లో సెలవు ఉందనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.


ఈ రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలిడే

ఆంధ్రప్రదేశ్, అండమాన్ & నికోబార్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తర ప్రదేశ్‌లలో బ్యాంకులు మూసివేయబడతాయి.

మరోవైపు ఈరోజు స్టాక్ మార్కెట్‌కు(stock market) కూడా సెలవు. షెడ్యూల్ ప్రకారం జులై 17న ప్రముఖ ఎక్స్ఛేంజీలైన NSE, BSE కార్యకలాపాలు కొనసాగువు. BSE వెబ్‌సైట్ ప్రకారం ఈక్విటీలు, ఈక్విటీ డెరివేటివ్, SLB విభాగాలు కూడా నేడు మూసివేయబడతాయి. మొహర్రం హిజ్రీ క్యాలెండర్ మొదటి నెల మొదటి రోజు. ఈ రోజు కర్బలా యుద్ధంలో ముహమ్మద్ ప్రవక్త మనవడు, ఇమామ్ హుస్సేన్, ఆయన అనుచరుల బలిదానం జ్ఞాపకంగా ఈ పండుగను జరుపుకుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇది విభిన్నంగా భావించబడుతుంది.


ఇవి కూడా చదవండి:

Viral Video: కన్యాదాన్ అసలు ప్రాముఖ్యతను వివరించిన నీతా అంబానీ


Union Budget 2024: బడ్జెట్‌కు ముందు సాంప్రదాయ హల్వా వేడుక.. నోళ్లను తీపి చేసిన ఆర్థిక మంత్రి


Gold and Silver Rates Today: మరింత ఖరీదైన బంగారం, పడిపోయిన వెండి.. ఎంతకు చేరాయంటే..

For Latest News and Business News click here

Updated Date - Jul 17 , 2024 | 10:15 AM