Airtel Scholarships: విద్యార్థులకు ఫ్రీ ల్యాప్‌టాప్, స్కాలర్‌షిప్.. అర్హతలివే
ABN , Publish Date - Jul 17 , 2024 | 09:23 AM
వెనకబడిన తరగతుల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించాలని ఎయిర్‌టెల్ నిర్ణయించింది. ఇందుకోసం భారతీ ఎయిర్‌టెల్ ఫౌండేషన్(Bharti Aitel Foundation) ప్రతి సంవత్సరం రూ.100 కోట్లు ఖర్చు చేయనుంది. ‘భారతీ ఎయిర్‌టెల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం’ వీటిని 4 వేల మంది విద్యార్థులకు అందించనున్నట్లు మంగళవారం వెల్లడించింది.
హైదరాబాద్: వెనకబడిన తరగతుల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించాలని ఎయిర్‌టెల్ నిర్ణయించింది. ఇందుకోసం భారతీ ఎయిర్‌టెల్ ఫౌండేషన్(Bharti Aitel Foundation) ప్రతి సంవత్సరం రూ.100 కోట్లు ఖర్చు చేయనుంది. ‘భారతీ ఎయిర్‌టెల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం’ వీటిని 4 వేల మంది విద్యార్థులకు అందించనున్నట్లు మంగళవారం వెల్లడించింది.
ప్రముఖ విద్యా సంస్థల్లో టెక్నికల్ విద్యను అభ్యసిస్తున్న వారికి ఈ ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. భారతీ ఎయిర్‌టెల్ ఫౌండేషన్ ఈ ఏడాదితో 25వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. సునీల్ మిత్తల్ దీనిని ప్రారంభించారు. అయితే స్కాలర్‌షిప్‌లకు సంబంధించి విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆగస్టులో ఫస్ట్ ఫేజ్‌లో 250 మంది విద్యార్థులను ఇందుకోసం ఎంపిక చేస్తున్నట్లు ఫౌండేషన్ వెల్లడించింది. 250 నుంచి 4 వేల మంది విద్యార్థులకు దశల వారీగా పెంచి, ఏడాదికి రూ.100 కోట్లు అందించాలని ప్రణాళిక నిర్దేశించుకుంది.
ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థినులకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దేశంలోని అగ్రగామి 50 ఎన్‌ఐఆర్‌ఎఫ్(NIRF) కాలేజీలు, ఐఐటీల్లో చదివే వారిని ఎంపిక చేస్తామని తెలిపారు. ఫౌండేషన్ ద్వారా గత 25 ఏళ్ల కాలంలో 60 లక్షల మందికి మేలు జరిగినట్లు భారతీ ఎయిర్‌టెల్ ఫౌండేషన్ కో ఛైర్మన్ రాకేశ్ భారతీ మిత్తల్ తెలిపారు.
కుటుంబ వార్షికాదాయం రూ.8.5 లక్షలకు మించని విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ అందిస్తారు. ‘భారతి ఎయిర్‌టెల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్’ ప్రధానంగా మహిళా విద్యార్థులపై దృష్టి సారించింది. ఈ స్కాలర్‌షిప్ ప్రతిభావంతులైన విద్యార్థులకు, ముఖ్యంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చి నాణ్యమైన విద్యను పొందలేకపోతున్నవారికి ఉపయోగపడనుంది.
ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, టెలికాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్సెస్, డేటా సైన్సెస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ (AI, IoT, AR/VR, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్) రంగాలలో UG, ఇంటిగ్రేటెడ్ కోర్సులు చేస్తున్న వారికి ఉపకార వేతనాలు అందిస్తారు. ఈ స్కాలర్‌షిప్ గ్రహీతలను 'భారతీ స్కాలర్స్' అని పిలుస్తారు. ఎంపికైన వారిక ల్యాప్‌టాప్ కూడా ఇస్తారు. ఆసక్తిగల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
For Latest News and National News click here