Business Idea: ఈ పాల వ్యాపారం చేయండి.. నెలకు రూ. 5 లక్షలకుపైగా సంపాదించండి..
ABN , Publish Date - Nov 10 , 2024 | 11:28 AM
మీరు జాబ్ మానేసి ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఇక్కడ చెప్పే వ్యాపారంలో మీరు నెలకు రూ. 5 లక్షలపైగా సంపాదించుకునే ఛాన్స్ ఉంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
గతంలో గేదె పాలు, ఆవు పాలు, గాడిద పాల వ్యాపారం గురించి విన్నాం. కానీ మీరెప్పుడైనా ఒంటె పాల(camel milk) వ్యాపారం గురించి విన్నారా, లేదా అయితే ఇక్కడ తెలుసుకుందాం పదండి. భారతదేశంలో ఒంటె పాలకు మంచి డిమాండ్ ఉంది. అనేక ఔషధ కంపెనీలు ఒంటె పాలను కొనుగోలు చేస్తున్నాయి. ఎందుకంటే వీటిలో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. చాక్లెట్, చీజ్, స్కిన్ క్రీమ్‌లు, సబ్బు వంటి ఉత్పత్తులతో ఒంటె పాలను విరివిగా ఉపయోగిస్తున్నారు. మీరు ఈ ఉత్పత్తులను వర్తకం చేసే వ్యాపారంలోకి కూడా ప్రవేశించవచ్చు.
ఆరోగ్యానికి కూడా..
ఒంటె పాలు ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మానవ శరీరానికి బలాన్ని ఇస్తాయి. ఇందులోని పోషకాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లోనూ వీటికి మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో 2024లో ఒంటెల కాపరుల ఆదాయాన్ని పెంచడానికి ఐక్యరాజ్యసమితి దీనిని ప్రోత్సహించింది. ఈ పాలు పలు రకాల వ్యాధులతో పోరాడడంలో కూడా సహాయపడుతాయి. ఈ పాలు తాగిన తర్వాత చాలా మందికి కడుపు సమస్యలు తగ్గిపోతాయి. డయాబెటిక్ రోగులకు కూడా ఒంటె పాలు ప్రయోజనకరంగా ఉంటాయి.
వీటికోసం పెట్టుబడి
మీకు ప్రస్తుతం ఉద్యోగం లేదా వ్యాపారం లేకపోతే మీరు ఒంటె పాల వ్యాపారం ప్రారంభించవచ్చు. దీనికోసం మీరు రాజస్థాన్ వంటి ప్రాంతాల నుంచి ఒంటెలను తీసుకురావాల్సి ఉంటుంది. లేదంటే అక్కడి నుంచి మీరు హోల్ సేల్ విధానంలో ఒంటె పాలను తీసుకొచ్చుకుని వ్యాపారం చేసుకోవచ్చు. ఒంటె పాలను సేకరించడానికి మీరు దానికి సంబంధిత పరికరాలు, ప్రాసెసింగ్ కోసం కంటైనర్లు, యంత్రాలు మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
ఎలా ప్రారంభించాలి?
ఒక వేళ మీరు ఒంటె పాలతో తయారు చేసిన వ్యాపార ఉత్పత్తుల వ్యాపారం చేయాలనుకుంటే మీ వ్యాపారాన్ని కొన్ని లక్షల రూపాయలలో సెటప్ చేసుకోవచ్చు. లేదంటే ఒంటెల పెంపకం లేదా డెయిరీ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మరింత పెట్టుబడి చేయాల్సి ఉంటుంది. అయితే దీని కోసం మీరు ముద్ర లోన్ వంటి అనేక ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్లాన్ చేసే విషయంలో ముందుగా మార్కెట్ విశ్లేషణ, దాని ఆర్థిక అంచనాలు, లాభ నష్టాల గురించి తెలుసుకుని ప్రారంభించుకోవాలి.
ఎంత ఆదాయం..?
ఒంటె పాలను ప్యాకెట్ల మాదిరిగా తయారు చేసి ఎగుమతులు కూడా చేసుకోవచ్చు. ఒంటె పాలను స్థానిక మార్కెట్లలో లేదా నేరుగా వినియోగదారులకు కూడా సేల్ చేసుకోవచ్చు. లేదంటే పాల ఉత్పత్తుల తయారీ దుకాణాలు, శీతల పానీయాల దుకాణాల ద్వారా మరింత మందికి అందుబాటులో ఉంచవచ్చు. రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఒంటె పాలు లీటరుకు రూ. 3500 వరకు పలుకుతోంది. మీరు సొంతంగా ఈ పాలను ప్రాసెస్ చేసి సేల్ చేయడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఈ వ్యాపారం నుంచి మీరు నెలకు రూ. 5 నుంచి 6 లక్షల వరకు సంపాదించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
Personal Finance: కేవలం రూ. 1200తో కోటీశ్వరులవ్వండి.. అందుకు ఎన్నేళ్లు పడుతుందంటే..
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Personal Finance: రూ. 2 కోట్లు సంపాదించాలంటే రోజు ఎంత పొదుపు చేయాలి..
Read More Business News and Latest Telugu News