Aadhaar ATM: ఆధార్ ఏటీఎంతో మీ ఇంటి దగ్గరే క్యాష్ విత్ డ్రా.. ఇలా చేస్తే చాలు..
ABN , Publish Date - Apr 11 , 2024 | 04:16 PM
ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇకపై మీ ఇంటి దగ్గరే క్యాష్ విత్ డ్రా చేసుకునే అవకాశం వచ్చింది. బ్యాంకులు(banks), ఏటీఎంల(atms) నుంచి డబ్బు విత్‌డ్రా చేయడం పాత ట్రెండ్. ప్రస్తుతం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్(India Post Payments Bank) ద్వారా ఆన్‌లైన్ ఆధార్(Aadhaar ATM) ATM (AePS) సేవను పొందడం ద్వారా మీరు ఇంటి వద్దనే సులభంగా నగదును తీసుకోవచ్చు.
ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇకపై మీ ఇంటి దగ్గరే క్యాష్ విత్ డ్రా చేసుకునే అవకాశం వచ్చింది. బ్యాంకులు(banks), ఏటీఎంల(atms) నుంచి డబ్బు విత్‌డ్రా చేయడం పాత ట్రెండ్. ప్రస్తుతం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్(India Post Payments Bank) ద్వారా ఆన్‌లైన్ ఆధార్(Aadhaar) ATM (AePS) సేవను పొందడం ద్వారా మీరు ఇంటి వద్దనే సులభంగా నగదును తీసుకోవచ్చు. ఆ క్రమంలో పోస్ట్‌మ్యాన్ మీ ఇంటికి వచ్చి నగదును విత్‌డ్రా చేయడంలో మీకు సహాయం చేస్తారు. ఈ నేపథ్యంలో మీకు అకస్మాత్తుగా నగదు అవసరం ఉంటే బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు. ఇండియా పోస్ట్ చెల్లింపు ఆధార్ ATM సర్వీస్ (AePS) ప్రయోజనాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ “ఆధార్ ATM” ఫీచర్‌ని ప్రారంభించింది. దీని సహాయంతో ఆధార్ కార్డ్(Aadhaar card) హోల్డర్లందరూ వారి బయోమెట్రిక్‌లను ఉపయోగించి ATM నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని కోసం మీ బ్యాంక్ ఖాతా తప్పకుండా ఆధార్ కార్డుకు లింక్ చేయబడి ఉండాలి. మీరు ఎటువంటి ఛార్జీలు చెల్లించకుండా డబ్బును విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని పొందవచ్చు. ఆధార్ ATM నుంచి డబ్బు తీసుకోవాలనుకునే ఆధార్ కార్డ్ హోల్డర్‌లందరూ రోజుకు గరిష్టంగా రూ.10,000 మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చని తెలుస్తోంది.
అయితే ఆధార్ ATM సహాయంతో డబ్బు విత్‌డ్రా చేసుకునే ప్రయోజనాన్ని పొందాలంటే ఆధార్ కార్డ్ హోల్డలందరూ ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.
ఆధార్ ATM ప్రయోజనాన్ని పొందడానికి ముందుగా మీరు IPPB అధికారిక వెబ్‌సైట్(https://www.ippbonline.com/web/ippb) హోమ్ పేజీని సందర్శించాలి
హోమ్ పేజీకి వెళ్లిన తర్వాత, మీరు డోర్ స్టెప్ బ్యాంకింగ్(https://www.ippbonline.com/web/ippb/doorstep-banking) ఎంపికపై క్లిక్ చేయాలి
క్లిక్ చేసిన తర్వాత మీరు జాగ్రత్తగా పూరించాల్సిన ఫారమ్ మీ ముందు వస్తుంది
అక్కడ అడిగిన మొత్తం సమాచారాన్ని పూర్తి చేయాలి
ఆ తర్వాత మీరు సమీపంలోని పోస్టాఫీసు పేరును నమోదు చేసి, ప్రొసీడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
పైన పేర్కొన్న అన్ని దశలను అనుసరించిన తర్వాత మీరు సులభంగా ఆధార్ ATMని పొందుతారు. పోస్టల్ ఉద్యోగి మీ ఇంటికి వచ్చి క్యాష్ విత్ డ్రా చేసి ఇస్తారు.
ఇది కూడా చదవండి:
SIP: ప్రతి రోజు రూ.110 ఇన్‌వెస్ట్ చేయండి.. కోటీశ్వరులుగా మారండి
Special Trains: రూ.200తో రామాలయం టూర్.. సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం