Share News

Pensioners: పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్..

ABN , Publish Date - Oct 21 , 2024 | 08:13 PM

పెన్షనర్లు మరింత సులభంగా, ప్రభావవంతంగా ఫిర్యాదు చేసేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. పెన్షన్లకు సంబంధించిన ఫిర్యాదులను 21 రోజుల్లోగా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఫిర్యాదు పరిష్కారానికి మరింత అదనపు సమయం అవసరమైతే దరఖాస్తుదారులకు ఆలస్యానికి సంబంధిన సమాచారాన్ని అందిస్తారు.

Pensioners: పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్..

పెన్షనర్లకు చిన్న శుభవార్త. పింఛన్లకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి కీలక మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరింత సులభంగా, ప్రభావవంతంగా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈ నూతన మార్గదర్శకాలను పింఛను, పింఛనుదారుల సంక్షేమ శాఖ విభాగం, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ విడుదల చేశాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌కు ప్రతిస్పందనగా కేంద్రం మార్గదర్శకాలను రూపొందించింది. ఫిర్యాదుల స్వీకరణకు అందుబాటులో ఉన్న సీపీఈఎన్‌జీఏఎంఎస్ (CPENGRAMS) పోర్టల్‌ను మెరుగుపరచడమే లక్ష్యంగా గైడ్‌లైన్స్ విడుదల చేశారు.


కాగా కేంద్ర మార్గదర్శకాల ప్రకారం.. ఫిర్యాదుల పరిష్కార అధికారులు (GRO) అన్ని ఫిర్యాదులను సక్రమంగా పరిష్కరించేలా వ్యవహరిస్తారు. ఒకవేళ సంబంధిత ఫిర్యాదు తమ విభాగానికి సంబంధించినది కాకుంటే.. సంబంధిత అధికారికి వీలైనంత త్వరగా పంపించాల్సి ఉంటుంది. ఫిర్యాదు చేసిన వ్యక్తికి ఎలాంటి పరిష్కారం చూపకుండా ఏ ఒక్క ఫిర్యాదును కూడా ముగించడానికి వీల్లేదని కేంద్రం తెలిపింది. అంతేకాకుండా నోడల్ అధికారులు ప్రతి నెలా పెన్షన్లకు సంబంధిత ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించేలా సమీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అధికారులు ఫిర్యాదుల సరళిని కూడా విశ్లేషిస్తారు. తద్వారా భవిష్యత్తులో అలాంటి సమస్యలు తలెత్తకుండా నివారణ చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తారు.


పెన్షన్లకు సంబంధించిన ఫిర్యాదులను 21 రోజుల్లోగా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఫిర్యాదు పరిష్కారానికి మరింత అదనపు సమయం అవసరమైతే దరఖాస్తుదారులకు ఆలస్యానికి సంబంధిన సమాచారాన్ని అందిస్తారు. ఫిర్యాదు పరిష్కారం సంతృప్తికరంగా లేకుంటే దరఖాస్తుదారులు తమ ఫిర్యాదును ముగించిన 30 రోజులలోపు అప్పీల్‌ కోస దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మార్గదర్శకాలు పింఛనుదారులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను సులభతరం చేస్తుందని కేంద్ర భావిస్తోంది.


ఇవి కూడా చదవండి

గృహ రుణాలు తీసుకోవాలనుకునేవారికి గుడ్‌న్యూస్

కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్‌లో పూనావాలాకు 50 శాతం వాటా

For more Business News and Telugu News

Updated Date - Oct 21 , 2024 | 08:15 PM