Electric Luna: వావ్ ఎలక్ట్రిక్ లూనా వస్తుందోచ్..ఎప్పటి నుంచంటే
ABN , Publish Date - Jan 26 , 2024 | 02:19 PM
1970-80లలో ప్రసిద్ధి చెందిన కైనెటిక్ లూనా టూవీలర్ భారత మార్కెట్లోకి మళ్లీ వచ్చేస్తుంది. అయితే ఈసారి లూనాను పూర్తిగా ఎలక్ట్రిక్ మోడల్లో లాంచ్ చేస్తున్నారు. ఈరోజు(జనవరి 26) నుంచి కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో దీని బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
1970-80లలో ప్రసిద్ధి చెందిన కైనెటిక్ లూనా టూవీలర్ భారత మార్కెట్లోకి మళ్లీ వచ్చేస్తుంది. అయితే ఈసారి లూనాను పూర్తిగా ఎలక్ట్రిక్ మోడల్లో లాంచ్ చేస్తున్నారు. ఈరోజు(జనవరి 26) నుంచి కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో దీని బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 500 రూపాయలు చెల్లించి ఈ టూవీలర్‌ను బుక్ చేసుకోవచ్చు.
ఈ కంపెనీ 1972లో లూనా వాహనాన్ని తొలిసారిగా మార్కెట్లోకి విడుదల చేసింది. సైకిల్, మోటార్‌సైకిల్ మాదిరిగా ఉన్న ఈ వాహనం అప్పట్లో ఫుల్ ఫేమస్ అయ్యింది. అంతేకాదు ఇది భారతదేశంలో 5 లక్షల యూనిట్లకుపైగా సేల్ అయ్యింది. ఆ తర్వాత డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ఈ కంపెనీ 21వ శతాబ్దం ప్రారంభంలో దీని ఉత్పత్తిని నిలిపివేసింది. ఇప్పుడు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతున్న క్రమంలో కైనెటిక్ గ్రీన్ తన బ్రాండ్ ఇ లూనాను మళ్లీ తీసుకొస్తుంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Budget 2024: 4 రకాల పన్ను మినహాయింపులను ఆశిస్తున్న చెల్లింపుదారులు.. గుడ్ న్యూస్ వచ్చేనా?
కైనెటిక్ ఇ లూనాను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70-75 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. దీని ధర రూ.70 నుంచి 80 వేల మధ్య ఉంటుందని తెలుస్తోంది. ఇ లూనా పాత మోడల్‌తో పోలిస్తే ఇందులో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఇది మునుపటిలా సాధారణ డిజైన్‌తో రానుంది. దీని ముందు భాగంలో LED లైట్‌ని చూడవచ్చు. పెద్ద మార్పు ఏమిటంటే ఇందులో పెడల్స్ కనిపించవు. ఇ లూనాకు కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.
లూనా 50cc ఇంజిన్‌తో రానుంది. ముందుగా ఈ వాహనాన్ని మెట్రో, టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాలతోపాటు గ్రామీణ మార్కెట్లోని వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మార్కెట్లో ఉన్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్, జావా, యెజ్డీ బైక్, వెస్పా స్కూటర్‌లకు ఇది మంచి పోటీ ఇవ్వనుంది.