Rohan Mirchandani: ప్రముఖ పెరుగు బ్రాండ్ సహ వ్యవస్థాపకుడు 42 ఏళ్లకే మృతి..
ABN , Publish Date - Dec 23 , 2024 | 09:14 AM
దేశంలోని ప్రముఖ పెరుగు బ్రాండ్ ఎపిగామియా సహ వ్యవస్థాపకుడు రోహన్ మిర్చందానీ 42 ఏళ్లకే గుండె పోటుతో మరణించారు. ఎపిగామియా మాతృ సంస్థ డ్రమ్స్ ఫుడ్ ఇంటర్నేషనల్ ఆయన మరణం గురించి సమాచారం అందించింది.
భారతీయ కంపెనీ ఎపిగామియా సహ వ్యవస్థాపకుడు రోహన్ మిర్చందానీ (RohanMirchandani) 42 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించారు. రోహన్ మరణాన్ని ధృవీకరిస్తూ ఎపిగామియా మాతృ సంస్థ డ్రమ్స్ ఫుడ్ ఇంటర్నేషనల్ శనివారం రాత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారతదేశంలోని ప్రముఖ పెరుగు బ్రాండ్లలో ఎపిగామియా కూడా ఒకటిగా ఉంది. ఎపిగామియా కుటుంబంలోని మనమందరం ఈ నష్టానికి తీవ్ర సంతాపం తెలియజేస్తున్నామని డ్రమ్స్ ఫుడ్ ఇంటర్నేషనల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో రోహన్ ఆలోచనలు, విలువలు మాకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. ఆయన వేసిన పునాదిని గౌరవించటానికి, ఆయన కల వర్ధిల్లేలా చేయడానికి మేము కలిసి పనిచేస్తున్నామని డ్రమ్స్ ఫుడ్ వెల్లడించింది.
ప్రముఖుల పెట్టుబడులు
ఈ కంపెనీలో చాలా మంది ప్రముఖులు పెట్టుబడులు పెట్టారు. వారిలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె కూడా ఉన్నారు. రోహన్ మిర్చందానీ NYU స్టెర్న్, వార్టన్ స్కూల్ నుంచి పట్టభద్రుడయ్యాడు. ఆయన 2013లో డ్రమ్స్ ఫుడ్ ఇంటర్నేషనల్‌కు పునాది వేశారు. డ్రమ్స్ ఫుడ్ అంతర్జాతీయ పెరుగు బ్రాండ్ ఎపిగామియా మాతృ సంస్థ. ఈ కంపెనీ మొదట హోకీ-పోకీ ఐస్‌క్రీమ్‌తో ప్రారంభమైంది. తరువాత గ్రీక్ యోగర్ట్ బ్రాండ్ ఎపిగామియాను ప్రారంభించారు. ఇది ప్రస్తుతం 30 నగరాల్లో 20,000 పైగా రిటైల్ కేంద్రాలను కలిగి ఉంది. అంతేకాదు ఈ కంపెనీ 2025-26 నాటికి మిడిల్ ఈస్ట్‌లో కూడా విస్తరించాలని యోచిస్తోంది.
వారసత్వాన్ని కొనసాగిస్తాం..
ఎపిగామియా కార్యకలాపాలను ఇప్పుడు కంపెనీ COO, వ్యవస్థాపక సభ్యుడు అంకుర్ గోయల్, సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ ఉదయ్ ఠక్కర్ డైరెక్టర్ల బోర్డు పూర్తి మద్దతుతో నిర్వహిస్తారని అధికారిక ప్రకటనలో తెలిపారు. ఇందులో రోహన్ కుటుంబం, రాజ్ మిర్చందానీ, ప్రధాన పెట్టుబడిదారులు ఉన్నారు. ఆయన దార్శనికతను ముందుకు తీసుకెళ్లేందుకు మేం కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా డైరెక్టర్ ఉదయ్ ఠక్కర్ తెలిపారు. రోహన్ వారసత్వాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు నాయకత్వంతో కలిసి పని చేస్తామని వెల్లడించారు. పెప్పర్‌ఫ్రై సహ వ్యవస్థాపకుడు అంబరీష్ మూర్తి, గుడ్ క్యాపిటల్ రోహన్ మల్హోత్రాతో సహా అనేక ఇతర ప్రముఖులను ఇటీవల భారతీయ స్టార్టప్ వ్యవస్థ కోల్పోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మిర్చందానీ నిష్క్రమించారు.
ఇవి కూడా చదవండి:
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Next Week IPOs: ఈ వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని కంపెనీలంటే..
Cyber Protection: సైబర్ మోసాల నుంచి మీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఇలా రక్షించుకోండి..
Public Holidays: 2025లో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని రోజులో తెలుసా..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..
Choti Choti Savings: ఈ చిన్నారి పొదుపును చూస్తే షాక్ అవుతారు.. వైరల్ వీడియో
Read More Business News and Latest Telugu News