Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో నయా అప్‌డేట్.. ఆ ఫీచర్ ప్రారంభం

ABN , Publish Date - Mar 03 , 2024 | 05:54 PM

ఇ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయడానికి యూపీఐ(Flipkart UPI) హ్యాండిల్‌ను ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్‌కి(Flipkart) చెందిన 500 మిలియన్లకుపైగా కస్టమర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఫ్లిప్‌కార్ట్ యాప్ బయట

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో నయా అప్‌డేట్.. ఆ ఫీచర్ ప్రారంభం

ఢిల్లీ: ఇ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయడానికి యూపీఐ(Flipkart UPI) హ్యాండిల్‌ను ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్‌కి(Flipkart) చెందిన 500 మిలియన్లకుపైగా కస్టమర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

ఫ్లిప్‌కార్ట్ యాప్ బయట, వెలుపల వ్యాపార లావాదేవీల కోసం ఇకపై యాప్‌లోనే ఉన్న యూపీఐ హ్యాండిల్‌తో పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ తరువాత కస్టమర్లకు మెరుగైన అనుభవం కోసం సూపర్ కాయిన్లు, క్యాష్ బ్యాక్, బ్రాండ్ వోచర్లు తదితర ప్రయోజనాలను అందించనుంది.


యాప్‌లో ఇ-కామర్స్ లావాదేవీలు, స్కాన్ చేసి UPI IDకి చెల్లించడం, రీఛార్జ్‌లు, బిల్లు చెల్లింపుల అందులో చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌ ఫిన్‌టెక్, పేమెంట్స్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ అనేజా మాట్లాడుతూ.. "సురక్షితమైన చెల్లింపులు జరుపుతూ.. కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు మేం కట్టుబడి ఉన్నాం. యూపీఐ చెల్లింపులపై రివార్డులు, వోచర్లు, సూపర్ కాయిన్లు ప్రకటిస్తాం. డిజిటల్ ఇండియా వైపు అడుగులేస్తున్న క్రమంలో మమ్మల్ని మేం మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం" అని ధీరజ్ అన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 07:44 PM