Bank Holidays: మే నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవు అంటే.?
ABN , Publish Date - Apr 30 , 2024 | 07:21 AM
మే నెలలో బ్యాంకులకు 10 రోజులు సెలవులు ఉన్నాయి. శని, ఆదివారాలు, ఇతర పండుగల నేపథ్యంలో పది రోజులు బ్యాంకులు పనిచేయవు. ఆయా రాష్ట్రాలను బట్టి బ్యాంకులకు సెలవు ఉంటుంది.
మే నెలలో బ్యాంకులకు 10 రోజులు సెలవులు ఉన్నాయి. శని, ఆదివారాలు, ఇతర పండుగల నేపథ్యంలో పది రోజులు బ్యాంకులు (Banks) పనిచేయవు. ఆయా రాష్ట్రాలను బట్టి బ్యాంకులకు సెలవు ఉంటుంది. మే 1వ తేదీన కార్మికుల దినోత్సవం అయినందున అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు పనిచేయవు.
మే 1వ తేదీన మే డే అయినందున మహారాష్ట్ర కర్ణాటక, తమిళనాడు, అసోం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, కేరళ, పశ్చిమ బెంగాల్, గోవా, బీహార్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
మే 7వ తేదీన మూడో విడత లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ రోజున గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
మే 8వ తేదీన విశ్వ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి. ఆ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
మే 10వ తేదీన బపవ జయంతి, అక్షయ తృతీయను పురస్కరించుకొని కర్ణాటకలో బ్యాంకులు పనిచేయవు.
మే 11వ తేదీన రెండో శనివారం అయినందున బ్యాంకులకు సెలవు ఉంటుంది.
మే 13వ తేదీన లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో శ్రీనగర్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
మే 16వ తేదీన సిక్కిం ఆవిర్భావ దినోత్సం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని బ్యాంకులు పనిచేయవు.
మే 23వ తేదీన బుద్ద పౌర్ణమి ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
మే 25వ తేదీన లోక్ సభ ఎన్నిక జరగనుండటంతో ఆగర్తాల, భువనేశ్వర్‌లో బ్యాంకులు పనిచేయవు.
మే 5, 12, 19, 26వ తేదీలు ఆదివారం అయినందున బ్యాంకులు మూసి ఉంటాయి.
Read Latest Business News and Telugu News