Gold and Silver Rates Today: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొనుగోళ్ల కోసం క్యూ కడుతున్న జనాలు
ABN , Publish Date - Jul 26 , 2024 | 06:31 AM
దేశంలో బంగారం(gold), వెండి(silver) ధరలు మళ్లీ తగ్గాయి. ఈ క్రమంలో పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా గోల్డ్ రేటు తగ్గిందని కొనుగోలు చేసేందుకు షాపుల వద్దకు వెళ్లి బారులు తీరుతున్నారు. ప్రస్తుతం నిన్నటితో పోల్చుకుంటే 24 గ్రాముల పసిడి రేటు 10 గ్రాములకు 1,190 రూపాయలు తగ్గింది.
దేశంలో బంగారం(gold), వెండి(silver) ధరలు మళ్లీ తగ్గాయి. ఈ క్రమంలో పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా గోల్డ్ రేటు తగ్గిందని కొనుగోలు చేసేందుకు షాపుల వద్దకు వెళ్లి బారులు తీరుతున్నారు. ప్రస్తుతం నిన్నటితో పోల్చుకుంటే 24 గ్రాముల పసిడి రేటు 10 గ్రాములకు 1,190 రూపాయలు తగ్గింది.ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 6.20 గంటల నాటికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,140కు చేరుకోగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.69,940గా ఉంది.
ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 69,810గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 63,990కు చేరింది. ఇంకోవైపు వెండి రేటు నిన్నటితో పోల్చితే కిలోకు 3,000 వేల రూపాయలు తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 84,400కు చేరుకుంది. అయితే ప్రస్తుతం దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి ధరల గురించి ఇప్పుడు చుద్దాం.
దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో పుత్తడి ధరలు 10 గ్రాములకు (24 క్యారెట్లు), (22 క్యారెట్లు)
హైదరాబాద్‌లో రూ. 69,810, రూ. 63,990
విజయవాడలో రూ. 69,810, రూ. 63,990
ఢిల్లీలో రూ. 69,940, రూ. 64,140
చెన్నైలో రూ. 70,140, రూ. 64,290
ముంబైలో రూ. 69,810, రూ. 63,990
వడోదరలో రూ. 69,840, రూ. 64,040
బెంగళూరులో రూ. 69,810, రూ. 63,990
కేరళలో రూ. 70,840, రూ. 63,990
కోల్‌కతాలో రూ. 69,810, రూ. 63,990
దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు
ముంబైలో రూ. 84,400
హైదరాబాద్‌లో రూ. 88,900
విజయవాడలో రూ. 88,900
ఢిల్లీలో రూ. 84,400
చెన్నైలో రూ. 88,900
బెంగళూరులో రూ. 84,400
కోల్‌కతాలో రూ. 84,400
వడోదరలో రూ. 84,400
కేరళలో రూ. 88,900
గమనిక: పేన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమాచారం ఆధారంగా కొనుగోళ్లు లేదా పెట్టుబడులు చేసే విషయంలో మళ్లీ రేట్లు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: ఆగస్టులో దాదాపు సగం రోజులు బ్యాంకులు బంద్.. కారణాలివే
టెక్ మహీంద్రా లాభంలో 23% వృద్ధి
Read More Business News and Latest Telugu News