స్థిరాస్తుల అమ్మకాల లాభాలపై కొత్త కొర్రీ
ABN , Publish Date - Jul 26 , 2024 | 04:24 AM
స్థిరాస్తుల అమ్మకాలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీటీ) తగ్గించామని చెబుతూనే.. ప్రభుత్వం పెద్ద బాంబు పేల్చింది. ఈ లాభాల లెక్కింపు కోసం ఆస్తుల కనీస విలువను లెక్కించేటప్పుడు...
వడ్డీ, స్టాంప్ డ్యూటీలు ఖర్చులు యథాతథం
న్యూఢిల్లీ: స్థిరాస్తుల అమ్మకాలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీటీ) తగ్గించామని చెబుతూనే.. ప్రభుత్వం పెద్ద బాంబు పేల్చింది. ఈ లాభాల లెక్కింపు కోసం ఆస్తుల కనీస విలువను లెక్కించేటప్పుడు, వాటిని కొనేటప్పుడు చెల్లించే స్టాంప్ డ్యూటీ, అప్పు చేసి కొంటే.. ఆ అప్పులపై చెల్లించే వడ్డీల భారం.. ప్రస్తుతం ఉన్న విధంగానే లెక్కింపులోకి రాదని స్పష్టం చేసింది. కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా గురువారం ఈ విషయం వెల్లడించారు. కొత్త ఎల్టీసీజీటీ విదానంలోనూ ఇదే పద్దతి కొనసాగుతుందన్నారు. దీంతో ద్రవ్యోల్బణం ఆధారంగా లెక్కించే ఇండెక్సేషన్ ఖర్చుల ప్రయోజనం రద్దయి, స్థిరాస్తుల దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను భారం 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గినా అమ్మకందారులకు పెద్దగా ప్రయోజనం లేదని భావిస్తున్నారు.