Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన పసిడి ధరలు
ABN , Publish Date - Aug 26 , 2024 | 06:58 AM
బంగారం కొనుగోలు చేసే వారికి చిన్న ఊరట. దేశ వ్యాప్తంగా స్వల్పంగా బంగారం(Gold Price Today) ధరలు పతనమయ్యాయి. ఆగస్టు 28న బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: బంగారం కొనుగోలు చేసే వారికి చిన్న ఊరట. దేశ వ్యాప్తంగా స్వల్పంగా బంగారం(Gold Price Today) ధరలు పతనమయ్యాయి. ఆగస్టు 28న బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా చాలా చోట్ల 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67 వేల 090గా ఉండగా... క్రితం రోజు ధర రూ.67 వేల100గా ఉంది. అదే సమయంలో ఇవాళ 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.73 వేల180 పలుకుతోంది. నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.73 వేల190 పలికింది. అయితే రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఆదివారం ఉదయంతో పోల్చితే ఇవాళ తులం బంగారం సుమారు రూ.100 వరకు తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.73 వేల 300కి చేరువైంది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67 వేల 900, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73 వేల 180గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్లు రూ. 66 వేల 940కాగా, 24 క్యారెట్ల ధర రూ. 73 వేల 300గా ఉంది. ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66 వేల 940, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73 వేల 300గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ. 66 వేల 940 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.73 వేల 300 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో..
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66 వేల 940కాగా, 24 క్యారెట్ల ధర రూ.73 వేల 300గా ఉంది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు తదితర ప్రాంతాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అయితే కిలో వెండి రూ. 100 మేర తగ్గింది. ఢిల్లీ, ముంబయి వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 87 వేల 900గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో రూ. 92 వేల 900 వద్ద కొనసాగుతోంది.
బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?
బంగారం స్వచ్ఛతను గుర్తించేందుకు ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్‌లపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని రాసి ఉంటుంది. ఎక్కువగా బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా అమ్ముతున్నారు. 24 క్యారెట్ల బంగారం ఎక్కువ స్వచ్ఛమైనది.
22, 24 క్యారెట్ల మధ్య తేడా తెలుసా?
24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది, 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో 9 శాతం రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలపడం ద్వారా ఆభరణాలను తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారంతో నేరుగా ఆభరణాలు తయారు చేయలేరు. ఆభరణాల తయారీ కోసం అందులో ఇతర లోహాలను కలపాల్సి ఉంటుంది. అందుకే చాలా మంది దుకాణదారులు 22 క్యారెట్ల బంగారాన్ని విక్రయిస్తున్నారు.
హాల్‌మార్క్‌పై శ్రద్ధ వహించండి
బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు నాణ్యతను గుర్తుంచుకోవాలి. వినియోగదారులు హాల్‌మార్క్ గుర్తును చూసిన తర్వాత మాత్రమే కొనుగోలు చేయాలి. హాల్‌మార్క్ అనేది బంగారంపై ప్రభుత్వ హామీ. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్‌ని నిర్ణయిస్తుంది. హాల్‌మార్కింగ్ స్కీమ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్, నియమ, నిబంధనల ప్రకారం పనిచేస్తుంది.
For Latest News click here