Gold Price: బంగారం ధర తగ్గిందోచ్..
ABN , Publish Date - Sep 03 , 2024 | 08:37 AM
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,690గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.72,760గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా ఇదేవిధంగా బంగారం ధర ఉంది.
పసిడి ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది. శ్రావణ మాసం ముగియడం, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధర తగ్గుతోంది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర రూ.250 వరకు తగ్గింది. మరో నాలుగు రోజుల్లో వినాయక చవిత పండగ ఉంది. చవితికి ముందు బంగారం కొనుగోలు చేయాలని అనుకునేవారికి మాత్రం బంగారం ధరల తగ్గింపు శుభవార్త అవుతోంది. వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,690గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.72,760గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా ఇదేవిధంగా బంగారం ధర ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,840 ఉంది. మేలిమి బంగారం ధర రూ. 72,910గా ఉంది. బెంగళూర్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66, 690గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.72,760గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,690గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.72,760గా ఉంది. కిలో వెండి ధరపై రూ.900 వరకు తగ్గింది. కిలో వెండి ధర రూ.85,900కి చేరింది.
బంగారం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు |
హైదరాబాద్ | 66,690 | 72,760 |
విజయవాడ | 66,690 | 72,760 |
ఢిల్లీ | 66,840 | 72,910 |
బెంగళూర్ | 66, 690 | 72,760 |
కేరళ | 66,690 | 72,760 |