Gold and Silver Rates Today: వావ్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ABN , Publish Date - Dec 24 , 2024 | 06:22 AM
బంగారం, వెండి ప్రియులకు అదిరిపోయే వార్త వచ్చేసింది. ఎందుకంటే రెండో రోజు వీటి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఎంత తగ్గాయి, ఏ నగరాల్లో ఎంత ఉన్నాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో చివరి నెల డిసెంబర్ మాసంలోని క్రిస్మస్ పండుగకు ముందు బంగారం(gold), వెండి (silver) ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే నిన్న తగ్గిన ఈ ధరలు, బులియన్ మార్కెట్లో ఈరోజు ఉదయం నాటికి పడిపోయాయి. ఈ క్రమంలో నేడు ఉదయం 6.20 గంటల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 76,270కు చేరుకుంది. ఇది నిన్నటితో పోల్చితే 1,170 రూపాయలు తగ్గడం విశేషం.
ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,914కు చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,000కు చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 69,667కు చేరింది. ఇక వెండి ధరల గురించి మాట్లాడితే కిలో వెండి ధర రూ. 88,760గా ఉంది. ఇది నిన్నటితో పోల్చితే రెండు వేల రూపాయలు తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో బంగారం, వెండి ధరల గురించి ఇప్పుడు చూద్దాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)
హైదరాబాద్‌లో రూ. 76,250, రూ. 69,896
విజయవాడలో రూ. 76,250, రూ. 69,896
ఢిల్లీలో రూ. 76,270, రూ. 69,914
చెన్నైలో రూ. 76,350, రూ. 69,988
ముంబైలో రూ. 76,130, రూ. 69,786
వడోదరలో రూ. 76,230, రూ. 69,878
కోల్‌కతాలో రూ. 76,030, రూ. 69,694
బెంగళూరులో రూ. 77,190, రూ. 69,841
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
ముంబైలో రూ. 88,910
చెన్నైలో రూ. 89,170
బెంగళూరులో రూ. 88,980
హైదరాబాద్‌లో రూ. 89,060
విజయవాడలో రూ. 89,060
చెన్నైలో రూ. 89,170
విశాఖపట్నంలో రూ. 89,060
కోల్‌కతాలో రూ. 88,800
ఢిల్లీలో రూ. 88,760
ముంబైలో రూ. 88,910
వడోదరలో రూ. 89,030
22, 24 క్యారెట్ల మధ్య తేడా మీకు తెలుసా?
బంగారం స్వచ్ఛతను గుర్తించేందుకు ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్క్ ఇస్తారు. 24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను 22 క్యారెట్ల బంగారంలో 9% కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం విలాసవంతమైనది అయినప్పటికీ, దీనిని ఆభరణాలు తయారు చేయడానికి ఉపయోగించుకోలేరు. అందుకే చాలా మంది దుకాణదారులు 22 క్యారెట్ల బంగారం విక్రయిస్తారు.
ఇవి కూడా చదవండి:
Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..
Cyber Protection: సైబర్ మోసాల నుంచి మీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఇలా రక్షించుకోండి..
Public Holidays: 2025లో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని రోజులో తెలుసా..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Read More Business News and Latest Telugu News