Share News

Google Maps: గూగుల్ మ్యాప్స్‌ అదిరిపోయే ఫీచర్స్.. ఇక ఆ కష్టాలకు చెక్..!

ABN , Publish Date - Jul 25 , 2024 | 06:03 PM

Google Maps Flyover Feature: ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినా.. తెలియని ప్రాంతానికి వెళ్లినా ఖచ్చితమైన మార్గం కోసం మనం మన ఫోన్‌లో వెంటనే గూగుల్‌ మ్యాప్ ఓపెన్ చేస్తాం. అందులో చూపించే మార్గం ద్వారా గమ్యాన్ని చేరుకుంటాం.

Google Maps: గూగుల్ మ్యాప్స్‌ అదిరిపోయే ఫీచర్స్.. ఇక ఆ కష్టాలకు చెక్..!
Google Maps

Google Maps Flyover Feature: ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినా.. తెలియని ప్రాంతానికి వెళ్లినా ఖచ్చితమైన మార్గం కోసం మనం మన ఫోన్‌లో వెంటనే గూగుల్‌ మ్యాప్ ఓపెన్ చేస్తాం. అందులో చూపించే మార్గం ద్వారా గమ్యాన్ని చేరుకుంటాం. అయితే, ఒక్కోసారిగా మనం ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ జామ్, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు వస్తుంటాయి. ఇవి కూడా ఆ రూట్ మ్యాప్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది. అయితే, ఫ్లై ఓవర్ల విషయంలో గూగుల్ మ్యాప్ యూజర్లు గందరగోళానికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. సర్వీస్ రోడ్డు, ఫ్లైఓవర్ ఒకే రూట్‌ మాదిరిగా కనిపిస్తుంటుంది. దాంతో.. ఫ్లైఓవర్ కింది నుంచి వెళ్లాలా? పై నుంచి వెళ్లాలా? అనే సంశయం కలుగుతుంది. ప్రస్తుతం మొబైల్ యూజర్లందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.


ఈ నేపథ్యంలోనే.. మ్యాప్స్ యూజర్లకు ఇబ్బంది ఉండకూడదని గూగుల్ మ్యాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సమస్యకు చెక్ పెట్టింది. ‘ఫ్లైఓవర్ కాల్ ఔట్’ పేరుతో కొత్త ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది గూగుల్ మ్యాప్. అయితే, ఈ ఫీచర్ అందుబాటులోకి రావడానికి ఇంకా వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లకు వారంలోపు అందుబాటులోకి రానుండగా.. ఐఓఎస్ యూజర్లకు మాత్రం కాస్త టైమ్ పడుతుందని సమాచారం.

Take-Flyover.jpg


ఇదొక్కటే కాదండోయ్.. కారులో ప్రయాణించే వారి కోసం కూడా సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది గూగుల్ మ్యాప్స్. కారు పరిమాణానికి సరిపడా రోడ్డు మార్గమేనా? కాదా? అనేది కూడా ఇండికేట్ చేయనుంది. అలాగే.. ఇప్పటి వరకు ఫ్యూయల్ స్టేషన్స్ చూపించినట్లుగానే.. ఇక నుంచి ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను కూడా చూపించనుంది.


గూగుల్ మ్యాప్స్ ఇండియా జీఎం లలితా రమణి మాట్లాడుతూ.. రోడ్డుమార్గం, ఫ్లైఓవర్ మార్గం విషయంలో సందేహపడుతుంటారు. అలాంటి సమస్యను పరిష్కరించేందుకే ‘ఫ్లైఓవర్ కాల్ ఔట్’ ఫీచర్‌ను తీసుకొచ్చాం. దీనిని దేశంలోని 40 నగరాల్లో వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తాం. తొలుత ఆండ్రాయిడ్ మ్యాప్స్, ఆండ్రాయిడ్ ఆటో యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఐఓఎస్, కార్ ప్లే యూజర్లకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.’ అని తెలిపారు.


‘ఇరుకు రోడ్లకు సంబంధి అలర్ట్ చేసే ఫీచర్‌ను కూడా తీసుకొచ్చాం. ఫోర్ వీలర్స్ వెళ్లే మార్గంలో రోడ్డు ఇరుకుగా ఉన్నట్లయితే.. ముందే హెచ్చరిస్తుంది. దీనిని తొలుత 8 నగరాల్లో అందుబాటులోకి తీసుకువస్తాం. అలాగే ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల వివరాలను కూడా మ్యాప్స్‌లో అందించేలా ఏర్పాట్లు చేశాం. ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్ల అందుబాటు, పోర్టు టైప్‌ వంటి వివరాలు కూడా ఇందులో లభిస్తాయి.’ అని లలితా రమణి చెప్పారు.

Narrow-Road.jpg


Also Read:

అశ్లీల వీడియోలు సర్క్యులేట్.. మహిళా డాక్టర్‌కు పెద్ద దెబ్బ

రిలేషన్‌షిప్‌లో ఈ తప్పు అస్సలు చేయకండి..

నాగుతో నాగరాజు ఆట.. తర్వాత ఏమైందంటే..?

For More Tech News and Telugu News..

Updated Date - Jul 25 , 2024 | 06:03 PM