Share News

January 1 Changes: గ్యాస్ సిలెండర్లు, పెన్షన్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. జనవరి 1వ తేదీ నుంచి మారేవి ఇవే..

ABN , Publish Date - Dec 26 , 2024 | 07:05 PM

మరో ఐదు రోజుల్లో నూతన సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో పలు నిబంధనలు మారబోతున్నాయి. 2025, జనవరి 1వ (2025, January 1st) తేదీ నుంచి ఏవేవి మారబోతున్నాయో తెలుసుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం.

January 1 Changes: గ్యాస్ సిలెండర్లు, పెన్షన్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. జనవరి 1వ తేదీ నుంచి మారేవి ఇవే..
Key changes from January 1, 2025

మరికొద్ది రోజుల్లో 2024వ సంవత్సరం ముగియబోతోంది. ఐదు రోజుల్లో నూతన సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో పలు నిబంధనలు మారబోతున్నాయి. 2025, జనవరి 1వ (2025, January 1st) తేదీ నుంచి ఏవేవి మారబోతున్నాయో తెలుసుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం. ఎల్‌పీజీ సిలెండర్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పెన్షన్లు మొదలైన చాలా విషయాలు కొత్త సంవత్సరం నుంచి మారబోతున్నాయి (New Rules).


ఎల్‌పీజీ సిలెండర్లు (LPG cylinder prices)

జనవరి 2025 నుంచి ఎల్‌పీజీ సిలెండర్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రతి నెలలో గ్యాస్ సిలెండర్ల ధరలను చమురు సంస్థలు రివ్యూ చేస్తాయి. చాలా నెలలుగా డొమస్టిక్ గ్యాస్ సిలెండర్ల ధరల్లో మార్పు లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో జనవరి గ్యాస్ సిలెండర్ల ధరలు పెరిగే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.

జీఎస్టీ పోర్టల్‌లో మార్పులు (Changes in GST rules):

జనవరి 1, 2025 నుంచి జీఎస్‌టీ పోర్టల్‌లో మూడు ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. వీటిలో రెండు మార్పులు ఇ-వే బిల్లు కాలపరిమితి, చెల్లుబాటుకు సంబంధించినవి. మూడో మార్పు జీఎస్టీ పోర్టల్‌కి సురక్షిత యాక్సెస్‌కి సంబంధించినది. ఈ నిబంధనలను సరిగ్గా అమలు చేయకపోతే కొనుగోలుదారు, విక్రేత, రవాణాదారు నష్టపోవచ్చు.


కార్ల ధరల్లో మార్పులు (Car Prices):

కొత్త సంవత్సరంలో కార్లు ధరలు పెరగవచ్చు. పలు కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. మారుతీ సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా, మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి కంపెనీలు కార్ల ధరను సుమారు 3% పెంచనున్నాయి.

ఫిక్స్‌డ్ డిపాజిట్ నిబంధనల్లో మార్పులు (Fixed Deposit rules to change):

నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (HFC) ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించిన నియమాలు కూడా జనవరి 1, 2025 నుంచి మారతాయని బ్యాంక్ కస్టమర్‌లు తప్పనిసరిగా గమనించాలి. ప్రజల నుంచి డిపాజిట్లు తీసుకునే నియమాలకు సంబంధించిన మార్పులు, లిక్విడ్ ఆస్తులను ఉంచే శాతం, డిపాజిట్లను బీమా చేయడం వంటివి మారబోతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 26 , 2024 | 07:05 PM