Share News

New Bike in Market: ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే.. 140 కిలోమీటర్లు దూసుకు పోతుంది..

ABN , Publish Date - Nov 20 , 2024 | 05:28 PM

మార్కెట్లో హోండా యాక్టివా వాహనాలను భారీ డిమాండ్ ఉందన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాలను సైతం మార్కెట్ లోకి తీసుకు వస్తుంది. ఒక్కసారి ఈ వాహనాన్ని ఛార్జింగ్ చేస్తే.. 140 కిలోమీటర్ల వరకు దూసుకు పోనుంది. ఈ వాహనం మార్కెట్ లోకి తీసుకు వచ్చేందుకు ముహూర్తం సైతం ఖారారు అయింది.

New Bike in Market: ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే.. 140 కిలోమీటర్లు దూసుకు పోతుంది..

భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)దే నన్నది సుస్పష్టం. ఎలక్ట్రిక్ వాహనాలను వాహనదారులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వాలు సైతం అనేక ఆకర్షణ చర్యలు చేపడుతున్నాయి. అందులోభాగంగా ఈవీలను కొనుగోలు చేస్తే.. రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూల్ చేయమని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేసేందుకు ఇప్పటికే వాహనదారులు క్యూ కడుతున్నారు.


అలాంటి వేళ.. మార్కెట్ లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ వాహనం రానుంది. ఈ వాహనం ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే.. 140 కిలోమీటర్లు దూసుకు పోయేలా దీనిని రూపొందిస్తున్నారు. అసలు అయితే హోండా మోటార్‌ సైకిల్, స్కూటర్ కు దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న వాహనాలు. అలాంటి ఆ సంస్థ.. యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నవంబర్ 27వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాకాలు చేస్తుంది. ఈ-స్కూటర్ టీజర్‌ను సైతం కంపెనీ ఇటీవల విడుదల చేసింది. ఇందులో రాబోయే హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ తాలుక ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ చూపించారు.


హోండా సంస్థ నుంచి వెలువడనున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్.. 2 రైడ్ మోడల్.. స్టాండర్డ్, స్పోర్ట్. స్టాండర్డ్ మోడ్‌లో.. ఎలక్ట్రిక్ యాక్టివా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 104 కిమీల వరకు దూసుకు పోనుంది. అంటే ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే స్కూటర్ స్టాండర్డ్ మోడ్‌లో 104 కి.మీ వరకు నడుస్తుంది. ఇక స్పోర్ట్ మోడ్‌లో.. స్కూటర్ ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది, దీని కారణంగా దాని పరిధిని గణనీయంగా తగ్గించ వచ్చు.


హోండా యాక్టివా ఎలక్ట్రిక్ ఫీచర్లు.. ధర

స్కూటర్ మీటర్, ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగానే పూర్తిగా డిజిటల్‌గా రూపొందించారు. ఈ స్కూటర్ నడుపుతున్న వాహనదారులు.. స్మార్ట్‌ఫోన్‌లతో కనెక్ట్ అవ్వగలదు. కంపెనీ అందించిన టీజర్‌లో హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వేరియంట్ వారీగా అనేక డిస్‌ప్లే ఎంపికలను సైతం వెల్లడించింది. అలాగే హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వేరియంట్‌లో, రైడర్ ఇంటిగ్రేటెడ్ నావిగేషన్ సదుపాయాన్ని కల్పించనున్నారు. ఇది మార్గాన్ని సులభంగా కనుగొనడంలో సహాయపడుతుంది.


అంతేకాకుండా.. రైడర్ తన ఎంపిక ప్రకారం సంగీతాన్ని కూడా నియంత్రించవచ్చు. ఇదే కాకుండా.. రాబోయే యాక్టివాలో కస్టమర్లు డ్యూయల్ రైడింగ్ మోడ్‌లను పొందుతారు, ఇందులో స్పోర్ట్స్ మరియు స్టాండర్డ్ ఉంటాయి. ఇది కాకుండా వినియోగదారులు బ్యాటరీ శాతంతోపాటు విద్యుత్ వినియోగం యొక్క రియల్ టైమ్ అప్‌డేట్‌లను కూడా పొంద వచ్చు. ఈ స్కూటర్ ధర రూ. లక్ష నుంచి రూ. లక్ష 20 వేల వరకు ఉంటుందని మార్కెట్ వర్గా్ల్లో ఓ అంచనా అయితే వైరల్ అవుతుంది.

For Business News And Telugu News

Updated Date - Nov 20 , 2024 | 05:28 PM