Share News

Free Gas Connections: ఆ మహిళలు మాత్రమే అర్హులు.. వివరాలివే..

ABN , Publish Date - Oct 08 , 2024 | 08:08 PM

మీకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ కావాలా.. కనెక్షన్‌తో పాటు సిలిండర్, స్టౌవ్ కూడా ఫ్రీగా కావాలా.. మరి ఎందుకు ఆలస్యం వెంటనే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద దరఖాస్తు చేసుకోండి.

Free Gas Connections: ఆ మహిళలు మాత్రమే అర్హులు.. వివరాలివే..
How Can Women Get Free LPG Gas Connections

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం అంటే ఏంటీ.. ఈ పథకం ద్వారా దరఖాస్తు చేస్తే మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ వస్తోందా అంటే ఔనని కేంద్ర ప్రభుత్వం అంటోంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలో చెబుతోంది. సింపుల్‌గా ఆన్ లైన్‌లో అప్లై చేసుకొని, గ్యాస్ కనెక్షన్ పొందాలని కోరింది. 2016లో ఉజ్వల యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. గ్యాస్ కనెక్షన్‌తోపాటు ఉచితంగా సిలిండర్ అందజేస్తారు. స్టవ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు.


gas-2.jpg


ఇలా అప్లై చేయండి..

గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి www.pmuy.gov.inకి వెళ్లాలి. హోం పేజీకి వెళ్లి డౌన్ లోడ్ సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పలు భాషల్లో ఫామ్స్ ఉంటాయి. మీ వీలును బట్టి ఇంగ్లీష్ లేదంటే తెలుగు భాషను ఎంచుకోండి. ఆ ఫామ్ డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. గ్యాస్ కనెక్షన్ పొందేందుకు కావాల్సిన సమాచారం ఆ ఫామ్‌లో నింపాలి.


gas-3.jpg


ఇలా ఫామ్ తీసుకొండి..

ఆన్ లైన్‌లో డౌన్ లోడ్ చేయడం వీలు కాదంటే.. సమీపంలో గ్యాస్ కనెక్షన్ సెంటర్ నుంచి ఫామ్ తీసుకునే వెసులుబాటు ఉంది. ఫామ్ నింపి, అడిగిన పత్రాలు జతచేయాలి. తర్వాత గ్యాస్ కనెన్షన్ కేంద్రంలో ఫామ్ ఇవ్వాలి. గ్యాస్ కనెక్షన్‌కు సంబంధించి డాక్యుమెంట్ వెరికేషన్ చేస్తారు. నిబంధనల మేరకు ఉంటే ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తారు.


ఇవి కంపల్సరీ

దరఖాస్తు చేసేందుకు క్యాస్ట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్, ఇన్ కం సర్టిఫికేట్, నివాస ధృవీకరణ పత్రం, పాస్ పోస్ట్ సైజ్ ఫొటోను ఫామ్‌కు జతచేయాల్సి ఉంటుంది.


  • ఉజ్వల పథకం కింద దరఖాస్తు చేసే మహిళ వయస్సు 18 ఏళ్ల కన్నా ఎక్కువగా ఉండాలి.

  • సదరు మహిళ పేరు ఇప్పటికే ఎల్పీజీ కనెక్షన్ ఉండొద్దు

  • సదరు మహిళ బీపీఎల్ కుటుంబానికి చెందినవారై ఉండాలి.

    మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Oct 08 , 2024 | 08:08 PM