Share News

Advance tax: డిసెంబర్ 15 లోపు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టకపోతే.. జరిమానాలు ఏ స్థాయిలో కట్టాలి..?

ABN , Publish Date - Dec 14 , 2024 | 04:54 PM

డిసెంబర్ 15వ తేదీ లోపు పన్ను చెల్లించకుంటే భారీ జరిమానాలను ఎదుర్కోవడమే కాకుండా, చట్టపరమైన చర్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది డిసెంబర్ 15వ తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి.. పన్ను చెల్లించాల్సిన వారు సోమవారం కూడా ఎలాంటి జరిమానా లేకుండా చల్లించవచ్చు.

Advance tax: డిసెంబర్ 15 లోపు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టకపోతే.. జరిమానాలు ఏ స్థాయిలో కట్టాలి..?
Advance Tax payment

మరికొద్ది గంటల్లో డిసెంబర్ 15వ తేదీ వచ్చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో విడత అడ్వాన్స్ ట్యాక్స్‌ (Advance tax) చెల్లింపునకు ఇదే చివరి గడవు. ఆ గడువు దాటితే జరిమానా కట్టాల్సిందే. అయితే ఈ ఏడాది డిసెంబర్ 15 (December 15) తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి.. పన్ను చెల్లించాల్సిన వారు సోమవారం కూడా ఎలాంటి జరిమానా లేకుండా చల్లించవచ్చు. డిసెంబర్ 15వ తేదీ లోపు పన్ను చెల్లించకుంటే భారీ జరిమానాలను ఎదుర్కోవడమే కాకుండా, చట్టపరమైన చర్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది (Advance tax payment).


అడ్వాన్స్ ట్యాక్స్ వల్ల జరిమానాలను నియంత్రించుకోవచ్చు. రూ.10 వేల కంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సిన వాళ్లు జూన్ 15, సెప్టెంబర్ 15, డిసెంబర్ 15, మార్చ్ 15 తేదీలలో నాలుగు విడుతల్లో పన్నును చెల్లించవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో అందే అన్ని ఆదాయాలను పరిగణనలోకి తీసుకుని, అందుబాటులో ఉన్న పన్ను మినహాయింపులను తీసేయాలి. మిగిలిన ఆదాయంపై పన్నును లెక్కగట్టాలి. అలా లెక్కకట్టిన పన్ను రూ.10 వేలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ముందస్తు పన్ను చెల్లించాలి. అలా అడ్వాన్స్ ట్యాక్స్ కడితే జరిమానాల భారం నుంచి తప్పించుకోవచ్చు.


అడ్వాన్స్ ట్యాక్స్‌ను సకాలంలో చెల్లించకపోతే వడ్డీ రూపంలో నెలకు 1 శాతం (సంవత్సరానికి 12 శాతం) జరిమానాగా కట్టాల్సి ఉంటుంది. పన్ను కట్టడం ఒక్క రోజు ఆలస్యమైనా తర్వాతి మూడు నెలలకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 15న ఆ మూడు నెలల వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ముందస్తు పన్ను మూడో వాయిదాను డిసెంబర్ 15న చెల్లించాలి. అయితే ఆ రోజు ఆదివారం కావడంతో చెల్లింపుదారులు ఎలాంటి జరిమానా కట్టాల్సిన అవసరం లేకుండానే డిసెంబర్ 15న పన్ను కట్టవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 14 , 2024 | 04:54 PM