Share News

Hyundai: హ్యుందాయ్ మోటార్ రికార్డ్ ఐపీవో.. స్టాక్ మార్కెట్లో ఓపెనింగ్ కోసం ఎదురుచూపులు

ABN , Publish Date - Oct 21 , 2024 | 11:04 AM

దక్షిణ కొరియా ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్(Hyundai Motors)కు చెందిన భారతీయ అనుబంధ సంస్థ ఈ వారంలో స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉందని కంపెనీ తెలిపింది.

Hyundai: హ్యుందాయ్ మోటార్ రికార్డ్ ఐపీవో.. స్టాక్ మార్కెట్లో ఓపెనింగ్ కోసం ఎదురుచూపులు

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ కొరియా ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్(Hyundai Motors)కు చెందిన భారతీయ అనుబంధ సంస్థ ఈ వారంలో స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉందని కంపెనీ తెలిపింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా షేర్లు గత వారం 3.3 బిలియన్ల డాలర్ల IPO సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియను అనుసరించి మంగళవారం భారత స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ప్రారంభించబోతున్నాయి. దక్షిణ కొరియా వెలుపల హ్యుందాయ్ మోటార్ మొదటి లిస్టింగ్ ఇదే కావడం గమనార్హం. హ్యుండాయ్ ఐపీఓ భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. ఇది 2022లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) 2.5 బిలియన్లు డాలర్ల రికార్డును బ్రేక్ చేసింది. IPO ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.1,865 - రూ.1,960గా నిర్ణయించారు.


దీన్ని ప్యూర్ ఆఫర్ ఫర్ సేల్(OFS)లా రూపొందించారు. తద్వారా వచ్చిన ఆదాయం మొత్తం ప్రమోటర్‌కు వెళుతుంది. గత సంవత్సరం దేశంలో 7,65,000 వాహనాలను ఉత్పత్తి చేసిన హ్యుందాయ్‌కి భారతదేశం కీలకమైన ఉత్పత్తి ప్రదేశం. జపాన్‌కు చెందిన మారుతీ సుజుకి తర్వాత హ్యుందాయ్ మోటార్ ఇండియా.. భారత్లోనే రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా రూపొందింది. భారతీయ స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేయడం ద్వారా కంపెనీ స్థానికంగా మరింత పోటీనివ్వగలదని పరిశీలకులు భావిస్తున్నారు. గత వారం సబ్‌స్క్రిప్షన్‌ పూర్తి చేసుకున్న హ్యుందాయ్‌ ఐపీఓ లిస్టింగ్‌పైనే అందరి దృష్టి ఉంది. వీటి షేర్లు అక్టోబర్‌ 22న స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ కానున్నాయి.


వ్యూహాత్మక పెట్టుబడులు...

హ్యుందాయ్ ఇటీవల భారత్లో గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. పుణేలోని జనరల్ మోటార్స్ తయారీ ప్లాంట్‌ను కొనుగోలు చేసింది. 2 లక్షల యూనిట్లకు పైగా వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో కంపెనీ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్‌తో సదుపాయాన్ని అప్‌గ్రేడ్ చేస్తోంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో దీన్ని ప్రారంభించిన తర్వాత, చెన్నై, పుణే ప్లాంట్‌లను ఉపయోగించడం ద్వారా హ్యుందాయ్ మోటార్ ఇండియా సంయుక్త వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1 మిలియన్ యూనిట్లకు చేరుకునే లక్ష్యంతో పని చేస్తోంది. అదనంగా దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను 2030 నాటికి 485కి విస్తరించాలని యోచిస్తోంది.


దాని అనుబంధ సంస్థ కియా కార్ప్‌తో పాటు, హ్యుందాయ్ ఈ సంవత్సరం భారతీయ బ్యాటరీ దిగ్గజం ఎక్సైడ్ ఎనర్జీతో భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకుంది. హ్యుందాయ్ 2025లో తన మొట్టమొదటి ఇండియా-స్పెసిఫిక్ క్రెటా SUVకి చెందిన ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన క్రెటా EVని పరిచయం చేయాలని భావిస్తోంది. ఈ మోడల్ చెన్నై ప్లాంట్‌లో ఉత్పత్తి అయిన మొదటి ఈవీగా నిలవనుంది. దీనితోపాటు భారతీయ మార్కెట్లో ఐదు EV నమూనాలను విడుదల చేయాలని యోచిస్తోంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి 2030నాటికి అనేక లక్ష్యాలు నిర్దేశించుకున్నామని యాజమాన్యం చెబుతోంది.

KTR: మా నినాదం గుర్తుందా.. ఎక్స్‏లో ఆసక్తికర పోస్ట్ చేసిన కేటీఆర్

Police Commemoration Day 2024: సలాం పోలీసన్నా.. నీ సేవలు వెలకట్టలేనివి

For Latest News and National News click here

Updated Date - Oct 21 , 2024 | 11:04 AM