Share News

ICICI Bank: 17 వేల క్రెడిట్ కార్డులు బ్లాక్ చేసిన ఐసీఐసీఐ బ్యాంక్.. డేటా దుర్వినియోగంపై క్లారిటీ!

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:38 PM

ఐసీఐసీఐ బ్యాంక్ తమ ఖాతాదారులకు చెందిన 17 వేల క్రెడిట్ కార్డులను బ్లాక్ చేసింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ తప్పు జరిగినట్టు అంగీకరించింది. ఆయా క్రెడిట్ కార్డులు ఇతరుల ఖాతాలకు తప్పుగా లింక్ అయినట్టు తెలిపింది. వెంటనే సమస్యను పరిష్కరించామని పేర్కొంది.

ICICI Bank: 17 వేల క్రెడిట్ కార్డులు బ్లాక్ చేసిన ఐసీఐసీఐ బ్యాంక్.. డేటా దుర్వినియోగంపై క్లారిటీ!
ICICI Bank

ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) తమ ఖాతాదారులకు చెందిన 17 వేల క్రెడిట్ కార్డులను బ్లాక్ చేసింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ తప్పు జరిగినట్టు అంగీకరించింది. ఆయా క్రెడిట్ కార్డులు (Credit cards) ఇతరుల ఖాతాలకు తప్పుగా లింక్ అయినట్టు తెలిపింది. వెంటనే సమస్యను పరిష్కరించామని, డేటా దుర్వినియోగం అయినట్టు ఇప్పటివరకు తమకు ఎలాంటి సమాచారమూ రాలేదని తెలిపింది. ఒకవేళ ఎవరైనా ఆర్థికంగా నష్టపోయినట్టైతే వారికి పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది (Credit cards blocked).


ఐసీఐసీఐ ఐమొబైల్ పే (iMobile Pay app) యాప్‌ వాడుతున్న ఖాతాదారులకు ఇతరుల క్రెడిట్ కార్డులు తప్పుగా లింక్ అయ్యాయి. అంతేకాదు ఆ యాప్‌లో క్రెడిట్ కార్డు నెంబర్లు, సీవీవీ (CVV) కనిపించాయి. అస్సలు క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేయని వారికి ఆ యాప్‌లో కూడా క్రెడిట్ కార్డు వివరాలు కనిపించాయి. దీంతో పలువురు కస్టమర్లు సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని వెల్లడించారు. వెంటనే అప్రమత్తమైన బ్యాంక్ స్పందించి ఆ లోపాన్ని సవరించింది. అయితే క్రెడిట్ కార్డు నెంబర్లు, సీవీవీ బహిర్గతం కావడంతో ఎవరైనా ఆ క్రెడిట్ కార్డు వివరాలను ఉపయోగించి లావాదేవీలు చేసే అవకాశం ఉంటుంది.


అలా మోసపూరిత లావాదేవీలు చేయడం కుదరదని, ఓటీపీ లేకుండా ట్రాన్సాక్షన్ చేయడం కుదరదని, ఆ వివరాల ద్వారా ఎలాంటి ఎలాంటి మోసమూ జరిగి ఉండకపోవచ్చని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. కాగా, ఇలా వివరాలు బహిర్గతమైన మొత్తం 17 వేల క్రెడిట్ కార్డులను ఐసీఐసీఐ బ్యాంక్ బ్లాక్ చేసింది. కొత్త కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చింది. ఎవరికైనా ఆర్థికంగా నష్టం జరిగి ఉంటే పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి..

Gold and Silver Prices: పుత్తడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ తగ్గిందోచ్


రూ.700 కోట్లతో దివీస్‌ విస్తరణ


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 26 , 2024 | 12:38 PM