Salary Hike: ఉద్యోగులకు షాకింగ్.. జీతాల పెంపు గురించి కీలక అప్‌డేట్
ABN , Publish Date - Oct 16 , 2024 | 08:08 PM
కార్పొరేట్ ప్రపంచంలో జీతాల పెంపు అనేది కీలకమైన అంశం. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా వచ్చిన ఓ సర్వే నివేదికలో వచ్చే ఏడాది చేపట్టనున్న జీతాల వృద్ధి గురించి ప్రస్తావించింది. ఆ పూర్తి వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలోని కార్పొరేట్ కంపెనీలలో పనిచేసే అనేక మంది ఉద్యోగులు(Employees) వారి జీతంలో(Salary Hike) ప్రతి ఏటా పెంపు ఉంటుందని ఆశిస్తారు. ఇదే క్రమంలో వచ్చే ఏడాది కూడా పెంపు కోసం ఆశిస్తున్న వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే 2025లో తమ ఉద్యోగులకు 9.5 శాతం జీతం పెంపును అందించవచ్చని ఓ నివేదిక తెలిపింది. కానీ ఇది ఈ సంవత్సరం వాస్తవ జీతాల పెరుగుదలకు సమానమని చెప్పడం విశేషం. WTW వేతన బడ్జెట్ ప్రణాళిక నివేదిక ప్రకారం భారతదేశంలో సగటు వేతన వృద్ధి 2025లో 9.5 శాతంగా అంచనా వేశారు. ఇది 2024లో ఈ ఏడాది 9.5 శాతంగా ఉన్న వాస్తవ జీతం పెరుగుదలకు సమానం.
ఈ రంగంలో
వచ్చే ఏడాది అత్యధిక జీతాల పెంపుదల 10 శాతం ఫార్మాస్యూటికల్ రంగంలో ఉండవచ్చని వెల్లడించింది. ఇదే సమయంలో తయారీ (9.9 శాతం), బీమా (9.7 శాతం), రిటైల్ (9.6 శాతం) విభాగాల్లో జీతాల పెరుగుదల సగటు స్థాయిల కంటే ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని తెలిపింది. 2025లో సాఫ్ట్‌వేర్, వ్యాపార సేవల రంగాల్లో మాత్రం వేతన వృద్ధి కేవలం తొమ్మిది శాతం మాత్రమే ఉంటుందని చెప్పింది.
ఈ విధంగా చూసినా కూడా నివేదిక ప్రకారం భారతీయ కార్పొరేట్ ప్రపంచం మొత్తం 9.5 శాతం జీతాల పెరుగుదలతో అగ్రస్థానంలో ఉందని వెల్లడించింది. మరోవైపు వియత్నాం (7.6 శాతం), ఇండోనేషియా (6.5 శాతం), ఫిలిప్పీన్స్ (5.6 శాతం), చైనా (ఐదు శాతం), థాయ్‌లాండ్ (ఐదు శాతం) భారత్ కంటే వెనుకబడి ఉంటాయని ప్రస్తావించింది.
రాజీనామాలు చేసినా..
WTW రివార్డ్స్ డేటా ఇంటెలిజెన్స్ సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించబడింది. సర్వే ఏప్రిల్ నుంచి జూన్ 2024లో నిర్వహించబడింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా 168 దేశాల నుంచి వచ్చిన సుమారు 32,000 ఎంట్రీల ఆధారంగా ఈ నివేదిక రూపొందించబడింది. ఈ సర్వేలో భారతదేశం నుంచి 709 మంది పాల్గొన్నారు. భారత్‌లోని కంపెనీలు వృద్ధిపై ఆశాజనకంగా ఉన్నాయని WTW ఇండియాలో అడ్వైజరీ హెడ్ రాజుల్ మాథుర్ తెలిపారు. పెద్ద ఎత్తున రాజీనామాలు ఉన్నప్పటికీ యజమానులు, ఉద్యోగులు స్థిరత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు.
మూడు రెట్లు
పనితీరు ఆధారిత వేతన వ్యత్యాసానికి సంస్థలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని మాథుర్ అన్నారు. ఈ ట్రెండ్ ప్రకారం సగటు పనితీరు కనబరిచే ఉద్యోగులతో పోల్చితే టాప్ పెర్ఫార్మర్లకు మూడు రెట్లు ఎక్కువ జీతం పెరిగే అవకాశం ఉంది. అయితే సగటు కంటే మెరుగైన ఉద్యోగుల సగటు ప్రదర్శకులతో పోలిస్తే 1.2 రెట్లు ఎక్కువ జీతం పెరుగుతుందని భావిస్తున్నారు. దాదాపు 28 శాతం కంపెనీలు రానున్న 12 నెలల్లో కొత్త రిక్రూట్‌మెంట్‌లు చేపట్టాలని యోచిస్తున్నట్లు నివేదిక ప్రస్తావించింది.
ఇవి కూడా చదవండి:
Air Arabia: ఎయిర్ అరేబియా 'సూపర్ సీట్ సేల్' ఆఫర్.. ఇంకొన్ని రోజులు మాత్రమే
Firecracker Insurance: ఫైర్‌క్రాకర్స్‌తో గాయపడితే ఇన్సూరెన్స్ పాలసీ.. ఫోన్ పే నుంచి కొత్త స్కీం..
Gold Investment: ఫిజికల్ గోల్డ్ లేదా డిజిటల్ గోల్డ్.. వీటిలో ఏ పెట్టుబడి బెస్ట్
BSNL: ఎయిర్‌టెల్, జియోకు బీఎస్ఎన్ఎల్ సవాల్.. రూ.6కే అపరిమిత కాలింగ్, 2జీబీ డేటా
Business Idea: రైల్వేలో ఈ బిజినెస్ చేయండి.. వేల సంపాదనతోపాటు..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Read More Business News and Latest Telugu News