iPhone : భారత్‌లో తగ్గిన ఐఫోన్ ధరలు
ABN , Publish Date - Jul 27 , 2024 | 06:38 AM
భారత్‌లో తన ఐఫోన్ల ధరలు 3 నుంచి 4 శాతం (రూ.300 నుంచి రూ.6,000) తగ్గిస్తున్నట్టు యాపిల్ కంపెనీ ప్రకటించింది. కేంద్ర బడ్జెట్‌లో మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ డ్యూటీ ని 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించటమే ఇందుకు
న్యూఢిల్లీ: భారత్‌లో తన ఐఫోన్ల ధరలు 3 నుంచి 4 శాతం (రూ.300 నుంచి రూ.6,000) తగ్గిస్తున్నట్టు యాపిల్ కంపెనీ ప్రకటించింది. కేంద్ర బడ్జెట్‌లో మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ డ్యూటీ ని 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించటమే ఇందుకు కారణం. ఈ నిర్ణయంతో భారత్‌లో తయారయ్యే ఐఫోన్ 13, 14, 15 మోడల్స్ ధర రూ.300 తగ్గింది. ఎంట్రీ లెవల్ ఐఫోన్ ఎస్‌ఈ ధరా రూ.49,900 నుంచి రూ.47,600కు చేరింది. దిగుమతి చేసుకునే తన లేటెస్ట్ మోడల్ ఐఫోన్ 15 ప్రో మోడల్ ధరా రూ.5,100 నుంచి రూ.6,000 వరకు తగ్గింది.
భారత్‌లో ఐఫోన్ 16 తయారీ!
యాపిల్ కంపెనీ ఈ ఏడాది సెప్టెంబరులో తన లేటెస్ట్ ఐఫోన్ 16 మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ ఫోన్లను భారత్‌లో అసెంబ్లింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.