Share News

Kotak Mahindra Bank: కోటక్ మహీంద్రా బ్యాంక్ కీలక ప్రకటన.. రూ. 4,100 కోట్లతో ఆ బ్యాంక్ వ్యాపారం కొనుగోలు

ABN , Publish Date - Oct 18 , 2024 | 06:27 PM

దేశంలోని బ్యాంకింగ్ రంగంలో మరో కీలక డీల్ జరిగింది. కోటక్ మహీంద్రా బ్యాంక్.. స్టాండర్డ్ చార్టర్డ్ వ్యక్తిగత రుణ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ డీల్ విలువ ఎంత, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Kotak Mahindra Bank: కోటక్ మహీంద్రా బ్యాంక్ కీలక ప్రకటన.. రూ. 4,100 కోట్లతో ఆ బ్యాంక్ వ్యాపారం కొనుగోలు
Kotak Mahindra Bank scb deal

దేశంలోని ప్రముఖ కోటక్ మహీంద్రా బ్యాంక్ (kotak mahindra bank) తన వ్యాపారం విషయంలో మరో ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో భారతదేశంలోని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వ్యక్తిగత రుణ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా ఈ సమాచారాన్ని అందించింది. ఈ కొనుగోలుకై ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందని వెల్లడించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం ఈ లావాదేవీ విలువ సెప్టెంబర్ 30, 2024 నాటికి రూ. 4,100 కోట్లు. ఇందులో స్టాండర్డ్ లోన్‌లు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఇది లోబడి ఉంటుంది.


కొనుగోలు వల్ల ప్రయోజనం ఏంటి?

అన్ని రెగ్యులేటరీ అనుమతులు పొందిన తర్వాత ఈ లావాదేవీ వచ్చే మూడు నెలల్లో పూర్తవుతుంది. కస్టమర్-సెంట్రిక్ గ్రోత్‌పై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఈ కొనుగోలు జరిగిందని కోటక్ మహీంద్రా బ్యాంక్ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ హై క్వాలిటీ లోన్ బుక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ సంపన్న కస్టమర్ సెగ్మెంట్‌లో తన ఉనికిని విస్తరించేందుకు మరింత అవకాశం ఉంది. దీంతోపాటు రిటైల్ లోన్ విభాగంలో కూడా తన నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసుకోనుంది.


ఇబ్బందులు లేకుండా..

ఈ క్రమంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ పర్సనల్ లోన్ కస్టమర్‌లకు ఇబ్బందులు లేకుండా సేవలను అందించనుంది. దీని కోసం సాంకేతిక నైపుణ్యం, నాణ్యమైన కస్టమర్ సేవలను సద్వినియోగం చేసుకోనున్నారు. ఈ క్రమంలో తమ విభాగాల్లో బలమైన రిస్క్ మేనేజ్‌మెంట్, కస్టమర్ సెంట్రిక్ ప్రొడక్ట్‌లు, టెక్నాలజీ ఆధారిత విధానం స్థిరమైన వృద్ధికి అవకాశం ఉందని కోటక్ మహీంద్రా బ్యాంక్ కన్స్యూమర్ బ్యాంక్ హెడ్ ప్రొడక్ట్స్ అంబుజ్ చందనా అన్నారు.


ఇది వరకు..

జనవరి 1న MD & CEOగా బాధ్యతలు స్వీకరించిన అశోక్ వాస్వానీ ఆధ్వర్యంలో జరిగిన మొదటి భారీ కొనుగోలు ఇది. అంతకుముందు ఉదయ్ కోటక్ ఆధ్వర్యంలో బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్న సిటీ బ్యాంక్ భారతీయ కస్టమర్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడాన్ని పరిశీలించారు. యాక్సిస్ బ్యాంక్ ఆ పోర్ట్‌ఫోలియోను కొనుగోలు చేసింది. ఏప్రిల్ 24న కోటక్ మహీంద్రా బ్యాంక్‌ డిజిటల్ ఛానెల్‌ల ద్వారా కొత్త కస్టమర్‌లను, కొత్త క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయకుండా రిజర్వ్ బ్యాంక్ నిలిపివేసింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఐటీ వ్యవస్థలో లోపాలను రెగ్యులేటర్ గుర్తించిన తర్వాత ఈ ఆంక్షలు విధించారు.


ఇవి కూడా చదవండి:

Gold Rates Today: సామాన్యులకు పసిడి రేట్ల షాకింగ్.. ఇప్పుడే ఇలా అయితే, మరి పెళ్లిళ్ల సీజన్ నాటికి..


Manappuram Finance: మణప్పురం ఫైనాన్స్‌‌కు భారీ షాక్.. 11 నెలల కనిష్టానికి షేర్లు


Stock Market: వారాంతంలో స్టాక్ మార్కెట్లో లాభాల జోష్.. కొన్ని గంటల్లోనే లక్షల కోట్ల లాభం..

Lay Offs: మళ్లీ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో లే ఆఫ్స్.. భయాందోళనలో టెకీలు..


Firecracker Insurance: ఫైర్‌క్రాకర్స్‌తో గాయపడితే ఇన్సూరెన్స్ పాలసీ.. ఫోన్ పే నుంచి కొత్త స్కీం..

Gold Investment: ఫిజికల్ గోల్డ్ లేదా డిజిటల్ గోల్డ్.. వీటిలో ఏ పెట్టుబడి బెస్ట్


Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 18 , 2024 | 06:30 PM