Share News

Ayodhya: రామాలయానికి ప్రతి ఏటా 5 కోట్ల మందికిపైగా టూరిస్టులు వచ్చే ఛాన్స్!

ABN , Publish Date - Jan 22 , 2024 | 02:00 PM

అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ తర్వాత భారత పర్యాటక రంగానికి మరింత ఊపు వస్తుందని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ తెలిపింది. ఈ క్రమంలో అయోధ్యకు సంవత్సరానికి 5 కోట్ల మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.

Ayodhya: రామాలయానికి ప్రతి ఏటా 5 కోట్ల మందికిపైగా టూరిస్టులు వచ్చే ఛాన్స్!

అయోధ్య(Ayodhya) రామమందిరం(Ram mandir) ప్రాణప్రతిష్ఠ తర్వాత భారత పర్యాటక రంగానికి మరింత ఊపు వస్తుందని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ తెలిపింది. ఈ క్రమంలో అయోధ్యకు సంవత్సరానికి 5 కోట్ల మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. రామ మందిర ప్రారంభోత్సవం భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటునిస్తుందని చెప్పింది. దీంతోపాటు భారతదేశం ఒక కొత్త పర్యాటక హాట్‌స్పాట్‌ను పొందినట్లు స్పష్టం చేసింది.


మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: Ram Mandir Pran Pratishtha: స్పైస్‌జెట్ స్పెషల్ ఆఫర్..ఏకంగా 30 శాతం

ప్రస్తుతం భారతదేశంలో పర్యాటక రంగం వాటా GDPలో 6.8 శాతంగా ఉంది. ఇప్పుడు అది FY 2033 నాటికి 8 శాతానికి చేరుతుందని జెఫరీస్ అంచనా వేసింది. మహమ్మారికి ముందు, పర్యాటక రంగం 2019 ఆర్థిక సంవత్సరంలో GDPకి 194 బిలియన్ డాలర్లను అందించింది. మరికొన్ని నెలల్లో అది 443 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని జెఫరీస్ చెప్పింది. అయోధ్యలో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా టూరిజంలో పెరుగుదల ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో హోటళ్లు, విమానయాన సంస్థలు, ఆతిథ్యం, ​​FMCG, ప్రయాణ ఉపకరణాలు, సిమెంట్ మొదలైన అనేక రంగాల ప్రయోజనం ద్వారా ప్రతి ఏటా 85 వేల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న రామాలయంలో జనవరి 22న రామ్‌లల్లాకు ప్రతిష్ఠాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Updated Date - Jan 22 , 2024 | 02:11 PM