Term Insurance: టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటున్నారా.. ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోవాలి..
ABN , Publish Date - Oct 31 , 2024 | 08:17 PM
Term Insurance: ఎప్పుడు ఉంటామో.. ఎప్పుడు పోతామో తెలియదు. ఇంటి నుంచి నవ్వుకుంటూ వెళ్లిన వాళ్లు.. తిరిగి అంతే క్షేమంగా వస్తారనే గ్యారెంటీ లేదు. అంతెందుకు.. అప్పటి వరకు మాట్లాడుతున్న వ్యక్తులే సడెన్‌గా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోతున్నారు. అకాల మరణాలతో ..
Term Insurance: ఎప్పుడు ఉంటామో.. ఎప్పుడు పోతామో తెలియదు. ఇంటి నుంచి నవ్వుకుంటూ వెళ్లిన వాళ్లు.. తిరిగి అంతే క్షేమంగా వస్తారనే గ్యారెంటీ లేదు. అంతెందుకు.. అప్పటి వరకు మాట్లాడుతున్న వ్యక్తులే సడెన్‌గా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోతున్నారు. అకాల మరణాలతో ఎంత మంది కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితి ఉంది. అందుకే.. చాలా మంది తాము లేకపోయినా తమ కుటుంబం సురక్షితంగా ఉండాలనే ఉద్దేశ్యంతో టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలని భావిస్తున్నారు. మీరు కూడా మీ ఫ్యామిలీ సేఫ్టీ కోసం ఫ్యామిలీ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే, ఆ ఇన్స్యూరెన్స్ తీసుకునే ముందు.. మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన 5 అంశాలు ఉన్నాయి. అవి తెలుసుకుని టర్మ్ ప్లాన్ తీసుకుంటేనే మీకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. లేదంటే.. భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఆ 5 ముఖ్యమైన అంశాలేంటో ఓసారి చూద్దాం..
ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలని భావించే వారు ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోవాలి. లేదంటే.. భవిష్యత్‌లో క్లెయిమ్ చేసినా రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తక్కువ వయసులోనే ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి..
చిన్న వయసులోనే టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. తక్కువ ప్రీమియం పడుతుంది. అదే ఎక్కువ వయసులో టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే.. ఎక్కువ ప్రీమియం కట్టాల్సి వస్తుంది. ఉదాహరణకు 25 ఏళ్ల వయసులో టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీని 70 ఏళ్ల వయసు వరకు తీసుకుంటే.. ఏడాదికి రూ. 14,000 పడుతుంది. అదే 40 ఏళ్ల వయసులో 70 ఏళ్ల వయసు వరకు టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే.. 40,000 వేలు ప్రీమియం కట్టాల్సి వస్తుందన్నమాట. అందుకే.. తక్కువ వయసు ఉన్నప్పుడే టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి.
సరైన సమాచారం ఇవ్వాలి..
పాలసీ తీసుకునే సమయంలో సరైన సమాచారం ఇవ్వాలి. మీ డాక్యూమెంట్లలో ఏదైతే పేరు ఉందో అదే పేరు, చిరునామాను ఎంటర్ చేయాలి. లేదంటే క్లెయిమ్ చేసుకునే సమయంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే, మీ హ్యాబిట్స్ పక్కాగా చెప్పాలి. సిగరెట్ తాగే అలవాటు ఉంటే.. ఉందని చెప్పాలి. డ్రింక్ చేసే అలవాటు ఉంటే ఉందని చెప్పాలి. అలాగే, ప్రీ డీసీజెస్ ఉన్నా కూడా చెప్పాలి. లేదంటే క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. పూర్తి సమాచారాన్ని, సరైన సమాచారాన్ని ఇన్స్యూరెన్స్ సంస్థకు ఇవ్వాలి.
నెలవారీ ఇన్‌కమ్ పే అవుట్ ఆప్షన్..
ఉదాహరణకు మీరు ఉద్యోగులు అనుకుంటే.. మీ సంవత్సర ఆదాయం రూ. 5 లక్షలు అంటే.. రూ. 1 కోటి టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. 70 ఏళ్ల వరకు పాలసీ తీసుకున్నట్లయితే.. ఆ పాలసీ వ్యవధిలో దురదృష్టావశాత్తు ఏదైనా జరిగితే సమ్ అష్యూర్డ్ అమౌంట్ అంతా కుటుంబానికి సదరు కంపెనీ అందజేస్తుంది. అయితే, ఇక్కడో ట్విస్ట్ ఉంది. మీ పేరిట బ్యాంకుల్లో ఏమైనా అప్పులు ఉన్నట్లయితే.. ఆ అప్పులన్నీ టర్మ్ పాలసీ కంపెనీ కట్టేస్తుంది. అలా కట్టిన అమౌంట్ పోగా.. మిగతా డబ్బును మొత్తాన్ని కుటుంబ సభ్యుల(నామినీ) ఖాతాలో వేస్తుంది. భారీ మొత్తం అమౌంట్ ఒకేసారి అకౌంట్ వేయడం వలన చాలా మంది వాటిని నిర్వహించలేక డబ్బునంతా కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే.. డబ్బు వృధా అవకుండా.. నెలవారీ పే అవుట్ ఆప్షన్ ఎంచుకోవడం ఉత్తమంగా చెప్పొచ్చు. తద్వారా కుటుంబ నిర్వహణ ఖర్చు ఈజీ అవుతుంది. పిల్లల భవిష్యత్‌కూ భరోసా ఉంటుంది.
ఈ ఆప్షన్ ఎంచుకుంటే.. ఒకే దఫాలో 50 నుంచి 70 శాతం వరకు డబ్బు బాధిత కుటుంబానికి సదరు ఇన్స్యూరెన్స్ సంస్థ అందిస్తుంది. అంటే.. కోటి రూపాయలు టర్మ్ పాలసీ తీసుకుంటే.. రూ. 50 లక్షల వరకు బాధిత కుటుంబానికి ఒకేసారి ఇస్తారు. మిగతాది నెలవారీగా అందజేస్తారు. తొలుత డబ్బుతో ప్లాటో ఏదో ఒకటి కొనుక్కోవడానికి ఉపయోగడుతుంది. మిగతా నెలవారీగా వచ్చే డబ్బు.. కుటుంబ మనుగడకు ఉపయోగపడుతుంది.
క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్, వేవర్ ఆఫ్ ప్రీమియం రైడర్..
టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీలో ఈ రెండూ ఎంతో కీలకం. ఎప్పుడు ఏ జబ్బులు వస్తాయో తెలియదు. అందుకే వీటిని సెలక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇవి యాడ్ ఆన్ ఆప్షన్‌లో ఉంటాయి. క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్ ఆప్షన్ యాడ్ చేసుకుంటే.. మీరు ఏదైనా అనారోగ్యానికి గురైతే మీకు ఎంచుకున్న మొత్తం (ఉదాహరణకు రూ. 25 లక్షలు) వస్తుంది.
వేవర్ ఆఫ్ ప్రీమియం రైడర్..
ఏదైనా ప్రమాదానికి గురైనా.. తీవ్రమైన అనారోగ్యానికి గురై ప్రీమియం కట్టలేని స్థితిలో మీరుంటే.. మీ ఫ్యూచర్ ప్రీమియంలు అన్నీ మాఫీ అవుతాయి. పాలసీ రన్ అవుతుంది. మీరు ఒక్క ప్రీమియం కూడా కట్టాల్సిన అవసరం లేదు. దురదృష్టావశాత్తు మీకు ఏదైనా జరిగితే కుటుంబానికి టర్మ్ పాలసీ అమౌంట్ మొత్తం అందుతుంది.
టాప్‌అప్ యువర్ కవరేజ్..
మీ శాలరీని బట్టి మీరు రూ. 1 కోటి పాలసీ తీసుకుంటే.. దానిని తదనంతర కాలంలో టాపప్ చేయించుకోవాలి. ఇది భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది. ఆ సమయానికి తగ్గట్లుగా డబ్బు చేతికి అందుతుంది. ప్రస్తుతం కోటి రూపాయలకు ఉన్నంత విలువ.. భవిష్యత్‌లో అంత విలువ ఉండదు. 20 ఏళ్ల తరువాత ఈ కోటి రూపాయల విలువ జస్ట్ రూ. 40 లక్షలు అవుతుంది. అందుకే ప్రతి సంవత్సరం టాప్‌అప్ చేసుకోవడం ఉత్తమం.
టర్మ్ పాలసీ తీసుకునేటప్పుడు ఇది కూడా చూసుకోవాలి..
టర్మ్ పాలసీ తీసుకునే వారు.. ముందుగా రెండు విషయాలను ఖచ్చితంగా చూసుకోవాలి. ఏ సంస్థ నుంచి టర్మ్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారో.. ఆ సంస్థ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో ఎక్కువగా ఉండాలి. అదేవిధంగా.. సాల్వెన్సీ రేషియో కూడా ఎక్కువగా ఉండాలి.
Also Read:
కన్నతల్లి, తోడబుట్టిన చెల్లి చీత్కారాలు.. బుద్ది మారని జగన్
రికార్డు స్థాయిలో బంగారం ధరలు: కొనుగోలు చేయాలా?
ఐపీఎల్ ఫ్రాంచైజీలు వదిలేసి స్టార్ క్రికెటర్ల జాబితా ఇదే
For More Business News and Telugu News..