Share News

New Rules: జులైలో ఈ రూల్స్ మారతాయి.. జాబితాలో క్రెడిట్ కార్డులు, సిలిండర్ ధరలు

ABN , Publish Date - Jun 26 , 2024 | 08:08 AM

ప్రతి నెలలాగే జులైలోనూ కొన్ని రూల్స్ మారనున్నాయి. ఈ జాబితాలో క్రెడిట్ కార్డులు, సిలిండర్ ధరలు ఉన్నాయి. ఇటీల క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. బ్యాంకులు సైతం ఈజీగా కార్డులను జారీ చేస్తున్నాయి. దీంతో డెబిట్ కార్డులను మించి క్రెడిట్ కార్డుల(Credit Cards) లావాదేవీలు జరుగుతున్నాయి.

New Rules: జులైలో ఈ రూల్స్ మారతాయి.. జాబితాలో క్రెడిట్ కార్డులు, సిలిండర్ ధరలు

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి నెలలాగే జులైలోనూ కొన్ని రూల్స్ మారనున్నాయి. ఈ జాబితాలో క్రెడిట్ కార్డులు, సిలిండర్ ధరలు ఉన్నాయి. ఇటీల క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. బ్యాంకులు సైతం ఈజీగా కార్డులను జారీ చేస్తున్నాయి. దీంతో డెబిట్ కార్డులను మించి క్రెడిట్ కార్డుల(Credit Cards) లావాదేవీలు జరుగుతున్నాయి. క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల కోసం చాలా మంది పేటీఎం, ఫోన్‌ పే, క్రెడ్‌ వంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌ ఉపయోగిస్తుంటారు. బిల్లు చెల్లింపులన్నీ ఒక చోట ఉంటాయని, రివార్డు పాయింట్లు వస్తాయని చాలా మంది వీటిని వినియోగిస్తుంటారు. థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా బిల్లులు చెల్లిస్తుంటే మీకు ఒక అలర్ట్.

జూన్ పూర్తయ్యాక యాప్స్‌ పేమెంట్లలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆర్‌బీఐ కొత్త నిబంధనలే దీనికి కారణం. క్రెడిట్‌ కార్డు బిల్లు పేమెంట్లు అన్నీ భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ (BBPS) ద్వారానే జరగాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. జులై 1 నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తుందని తెలిపింది. క్రెడిట్ కార్డుల బిల్లు చెల్లింపుల్లో సమర్థత, భద్రతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ (RBI) తెలిపింది. ఇందులో భాగంగా బ్యాంకులు భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ను ఎనేబుల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.


ఎస్‌బీఐ,ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కోటక్‌ మహేంద్రా, వంటి 8 ప్రధాన బ్యాంకులు మాత్రమే ఈ సిస్టమ్‌ను యాక్టివేట్‌ చేసుకున్నాయి.ఇతర బ్యాంకులు ఇప్పటి వరకు భారత్ పేమెంట్ సిస్టమ్ యాక్టివేట్‌ చేసుకోలేదు. పలు బ్యాంకులు భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ను యాక్టివేట్‌ చేసుకోకపోవడం కారణంగా ఫోన్ పే, క్రెడ్‌ వంటి కంపెనీలు ఆయా బ్యాంకుల కస్టమర్ల క్రెడిట్‌ కార్డుల బిల్లులను ప్రాసెస్‌ చేయడం కుదరదు.

దీనివల్ల థర్డ్ పార్టీ యాప్స్‌లో క్రెడిట్‌ కార్డు బిల్లులు చెల్లించలేరు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. బ్యాంక్‌ అధికారిక వెబ్‌సైట్‌, యాప్‌ ద్వారా పేమెంట్లు చేయవచ్చు. బీబీపీఎస్‌ని యాక్టివేట్ చేసుకోవడానికి గడువు పొడిగించాలని పరిశ్రమ వర్గాలు ఆర్బీఐను కోరుతున్నాయి.


సిలిండర్ ధరలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు

ఎల్‌పీజీ సిలిండర్ ధరలు ప్రతి నెలా మొదటి తేదీన నిర్ణయిస్తారు. చివరగా జూన్ 1న వాణిజ్య సిలిండర్ల ధరలను ప్రభుత్వం తగ్గించింది. మరి ఈసారి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక దేశంలోని మూడు పెద్ద బ్యాంకులలో ఒకటిగా పరిగణిస్తున్న ఇండియన్ బ్యాంక్, IDBI బ్యాంక్, పంజాబ్ & సింధ్ బ్యాంక్ ప్రత్యేక FD కోసం జూన్ 30 వరకు గడువు విధించింది.

ఐడీబీఐ బ్యాంక్ లక్షలాది మంది కస్టమర్లకు ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్లను అందిస్తోంది. ఈ బ్యాంక్ 300 రోజులు, 375 రోజులు, 444 రోజుల ప్రత్యేక FDలను ఇస్తోంది. వీటిపై 7.75 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ పథకం 2024 జూన్ 30 వరకు కస్టమర్‌లకు అందుబాటులో ఉంటుంది. IDBI బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. మీరు ఉత్సవ్ FD పథకంలో జూన్ 30 వరకు పెట్టుబడి పెట్టవచ్చు.


IDBI బ్యాంక్ సాధారణ కస్టమర్‌లకు 444 రోజుల FDపై 7.25% వడ్డీని అందిస్తోంది.375 రోజుల ఉత్సవ్ FDలో పెట్టుబడి పెట్టే సీనియర్ సిటిజన్లకు ఐడీబీఐ 7.60% వడ్డీని ఇస్తోంది. అదే సమయంలో, సాధారణ కస్టమర్‌లు, NRI, NROలకు 375 రోజుల FDపై 7.10% వడ్డీని అందిస్తోంది. ఇండియన్ బ్యాంక్ సైతం తన కస్టమర్లకు ప్రత్యేక FD పథకాన్ని అందిస్తోంది. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ తన కస్టమర్లకు 300 , 400 రోజులపాటు FDని అందిస్తోంది. ఇండియన్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, 30 జూన్ వరకు Ind Super 400, Ind Supreme 300 రోజుల FD పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు.

.For Latest News and National News click here..

Updated Date - Jun 26 , 2024 | 08:19 AM