Share News

Ola: ఓలా స్కూటర్ల జీవితకాలం గురించి సీఈఓ కీలక ప్రకటన

ABN , Publish Date - Feb 02 , 2024 | 04:05 PM

ప్రస్తుతం దేశంలో ఓలా ఎలక్ట్రిక్ వాహనాలు ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ స్కూటర్ల జీవితకాలం, బ్యాటరీ లైఫ్ గురించి కీలక ప్రకటన చేశారు.

Ola: ఓలా స్కూటర్ల జీవితకాలం గురించి సీఈఓ కీలక ప్రకటన

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. పెరిగిన పెట్రోల్ ధరల కారణంగా ప్రజలు వీటిని ఎక్కువగా ఆదరిస్తున్నారు. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ వాహనాలు ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. దేశంలోనే అత్యధికంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించే బ్రాండ్‌గా ఈ కంపెనీ అవతరించింది.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: Paytm: పేటిఎమ్ షేర్లు కొన్న వారికి షాకింగ్ న్యూస్.. వరుసగా రెండో రోజు కూడా


ఈ నేపథ్యంలోనే ఓలా సంస్థ సీఈఓ భావిష్ అగర్వాల్ ఈ స్కూటర్‌ల గురించి కీలక ప్రకటన చేశారు. ఇవి ఎనిమిది సంవత్సరాలు లేదా 80,000 కిమీ వారంటీని కలిగి ఉంటాయని అన్నారు. ఓలా స్కూటర్లు ప్రస్తుతం ఉపయోగిస్తున్న పెట్రోల్ ద్విచక్రవాహనాల కంటే రెట్టింపు జీవితకాలం అందించగలవని భవిష్ అగర్వాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే పొడిగించిన బ్యాటరీ లైఫ్ వారంటీతోపాటు ఎలక్ట్రిక్ వాహన కంపెనీ రాబోయే త్రైమాసికంలో 10,000 ఛార్జింగ్ పాయింట్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని చూస్తోందని అన్నారు.

ఈ కంపెనీ ప్రస్తుతం దేశంలో Ola S1, Ola S1 ప్రో, Ola S1 ఎయిర్ వంటి మూడు మోడళ్లను విక్రయిస్తోంది. అయితే ఈ మోడళ్లలో Ola S1 X కొత్త శ్రేణి, Ola S1 ప్రో మోడల్‌ను కూడా అప్‌డేట్ చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ క్రమంలోనే Ola S1 X కొత్త స్కూటర్‌ ధరను రూ.79,999గా ప్రకటించారు.

ఈ స్కూటర్ పరిధి 95 కిమీ కాగా గరిష్ట వేగం గంటకు 85 కి.మీగా పేర్కొన్నారు. Ola S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ 11kW బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. Ola S1 ప్రో జెన్ 2 ఇ స్కూటర్ కాంప్లిమెంటరీ 5 సంవత్సరాల పొడిగించిన బ్యాటరీ వారంటీతో వస్తుంది. S1 ఎయిర్ కస్టమర్‌లు దానిపై 50% తగ్గింపును పొందవచ్చు. 10,000 వరకు ఎక్స్‌ఛేంజ్ సౌకర్యం కూడా ఉంది.

Updated Date - Feb 02 , 2024 | 04:06 PM