PAN 2.0: పాన్ 2.0 వెర్షన్‌పై స్పష్టత ఇచ్చిన కేంద్రం
ABN , Publish Date - Dec 26 , 2024 | 03:21 PM
PAN 2.0: కేంద్రం పాన్ 2.0 వెర్షన్ తీసుకు వచ్చింది. దీనిపై ప్రజల్లో పలు సందేహాలను ఉన్నాయి. వాటిని వివరించింది. ఆ క్రమంలో పాన్ 2.0 వెర్షన్ ఎందుకు తీసుకు వచ్చింది వివరించిందీ కేంద్రం.
భారత ప్రభుత్వం ప్రస్తుతం డైనమిక్ క్యూఆర్ కోడ్ ద్వారా పాన్ 2.0 ప్రాజెక్ట్‌ను చేపట్టింది. పన్ను చెల్లింపుదారుల్లో.. ప్రస్తుతం పాన్ కార్డుల వినియోగం, కొత్త కార్డుల ధరలు.. అప్‌గ్రేడ్ చేసిన వెర్షన్‌లలో ఫీచర్లపై ప్రజల్లో పలు ప్రశ్నలు ఉత్పన్న మవుతోన్నాయి. ఆ క్రమంలో పన్ను చెల్లింపుదారుల్లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకొంటుంది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
డైనమిక్ క్యూఆర్ కోడ్: పాన్ 2.0 కీలక ప్రయోజనం
2017 - 18 ఆర్థిక సంవత్సరంలో పాన్ కార్డులలో ప్రభుత్వం క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. డైనమిక్ క్యూఆర్ కోడ్ ద్వారా పాన్ కార్డు సవరించబడుతోంది. దీంతో కొత్త వర్షన్ వల్ల పాన్ కార్డు డేటా బేస్ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతోంది. దీని వల్ల డేటాపై సంపూర్ణ విశ్వాసం ఏర్పడనుంది. ఇప్పటికే కార్డులున్న పాన్ హోల్డర్‌లు ప్రస్తుత పాన్ 1.0 సిస్టమ్ లేదా అప్‌గ్రేడ్ చేసిన పాన్ 2.0 కింద డైనమిక్ క్యూఆర్ కోడ్‌లతో కొత్త కార్డ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అప్‌డేట్ పాన్ వివరాలను ధృవీకరించడానికి ఇది ప్రత్యేకంగా సహాయపడుతుంది.
ఇంతకీ పాన్ 2.0 ప్రాజెక్ట్ అంటే ఏమిటీ.. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం..?
పన్ను చెల్లింపుదారుల నమోదు ప్రక్రియను సులభతరం చేయడం.
సత్వరంగా.. సమర్థవంతంగా సేవలు అందించండి.
ఫిర్యాదుల పరిష్కార విధానాలు బలోపేతం చేయడం.
డేటా రక్షణతోపాటు భద్రతను మరింత మెరుగుపరచడం.
అధునాతన పరిజ్జానాన్ని వినియోగించి.. పాన్, ట్యాన్‌లను క్రమబద్దికరించడానికి ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం పని చేస్తోంది.
అయితే పాన్ 2.0 ప్రాజెక్ట్ నేపథ్యంలో పాత పాన్ కార్డు హోల్డర్లు.. కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోనవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాత పాన్ కార్డులు యాథాతథంగా పని చేస్తాయని వివరణ ఇచ్చింది. తద్వారా పన్ను చెల్లింపు దారులపై ఆర్థిక భారం మోప లేదని స్పష్టం చేసింది.
ఇక అప్ గ్రేడ్ చేసిన కొత్త పాన్ కార్డు పొందాలంటే మాత్రం నామ మాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది. కానీ కొత్త పాన్ కేటాయింపులతోపాటు అప్ డేట్ చేసుకోవడం మాత్రం ఉచితమంది. వీటికి ఎటువంటి ధర నిర్ణయించ లేదని స్పష్టం చేసింది.
వ్యయ విశ్లేషణతోపాటు..
మరోవైపు ఈ ప్రాజెక్ట ప్రారంభించే వేళ.. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్‌తోపాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రాయోజితం చేస్తుందని స్పష్టం చేశారు. కార్డు హోల్డర్లకు.. అనవసరమైన ఖర్చు లేకుండా.. పన్ను చెల్లింపుదారులసేవలను మెరుగు పరచడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి పంకజ్ చౌదరి వివరించారు. ప్రస్తుతం ఈ వ్యవస్థను అప్ గ్రేడ్ చేయడంలో భాగంగా పాన్ 2.0 ప్రాజెక్ట్ పై ప్రభుత్వం దృష్టి సారించింది.
పాన్ 2.0 ప్రాజెక్ట్ అభివృద్ధికి నియంత్రణ సంస్థలు ఉడయ్ (UIDAI), సెబి ( SEBI), ఆర్బీఐ (RBI), ఏమ్‌సీఏ (MCA), జీఎస్టీఎన్ ( GSTN)లతో చర్చలు జరిపింది. స్టాండింగ్ టెక్నికల్ కమిటీ సైతం ఈ ప్రణాళికను సమీక్షించింది. ఆ క్రమంలో అందుకు సాధికారత సాంకేతిక బృందం మద్దతు తెలిపింది.
ప్రస్తుతమున్న పాన్ కార్డులు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. అయితే ప్రస్తుత కార్డు హోల్డర్లు... అప్ గ్రేడ్ చేసిన వెర్షన్‌కు మారాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి లేదని స్పష్టం చేసింది. పన్ను చెల్లింపుదారుల సౌకర్యం కోసం ఈ సవరణ ప్రధాన ఉద్దేశ్యమని వెల్లడించింది. అలాగే కొత్త దరఖాస్తుదారులకు సేవలను మెరుగు పరచడంలో ఇది ఒక భాగమని చెప్పింది. ఇప్పటికే ఉన్న పాన్ హోల్డర్లపై అదనపు ఖర్చులు విధించకుండా సేవలను మెరుగుపరచడానికి ఈ పాన్ 2.0 ప్రాజెక్ట్ రూపొందించబడిందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
For Business News And Telugu News