Personal Loan: ఆన్‌లైన్‌లో పర్సనల్ లోన్ పొందడం ఇంత ఈజీనా..
ABN , Publish Date - Oct 23 , 2024 | 02:56 PM
Personal Loan: ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్ నడుస్తోంది. దసరా ముగిసింది. ధన్‌తేరాస్, దీపావళి వంటి ప్రధాన పండుగలు సమీపిస్తున్నాయి. దీంతో ప్రజలంతా షాపింగ్ కోసం సిద్ధమవుతున్నారు. మీరు కూడా షాపింగ్ చేయాలని భావిస్తున్నారా.. డబ్బులు లేక పర్సనల్ లోన్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా..
Personal Loan: ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్ నడుస్తోంది. దసరా ముగిసింది. ధన్‌తేరాస్, దీపావళి వంటి ప్రధాన పండుగలు సమీపిస్తున్నాయి. దీంతో ప్రజలంతా షాపింగ్ కోసం సిద్ధమవుతున్నారు. మీరు కూడా షాపింగ్ చేయాలని భావిస్తున్నారా.. డబ్బులు లేక పర్సనల్ లోన్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా.. మరి ఇన్‌స్టాంట్‌గా పర్సనల్ లోన్ పొందడం ఎలా.. అప్లై చేసుకున్న కొద్ది గంటల్లోనే డబ్బు అకౌంట్‌లో పడుతుందా.. ఇందుకోసం ఏం చేయాలి.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు మీకోసం..
ఆన్‌లైన్ పర్సనల్ లోన్..
ఇన్‌స్టాంట్ పర్సనల్ లోన్.. బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించే అవసరం లేకుండానే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ లోన్‌లో సాధారణంగా ఇన్‌స్టాంట్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. అప్లై చేసిన కొన్ని గంటల్లోనే డబ్బు మీ అకౌంట్‌లోకి బదిలీ అవుతుంది. ఫలితంగా దరఖాస్తుదారులు త్వరగా లోన్‌ను తీసుకోవచ్చు.
ఎలా అప్లై చేయాలి..
ఇన్‌స్టాంట్ పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి బ్యాంక్‌తో మీ ఆధార్, పాన్ కార్డ్ లింక్ చేయాలి. అలాగే, మొబైల్ నెంబర్ కూడా లింక్ చేసి ఉండాలి.
అర్హత ఉందా చెక్ చేసుకోవాలి..
మీరు లోన్ తీసుకునేందుకు అర్హులా? కాదా? అనేది చెక్ చేసుకోవాలి. మీరు సమర్పించిన వివరాలను బ్యాంక్ ధృవీకరిస్తుంది. ఆ తరువాత లోన్ పొందేందుకు మీరు అర్హులా.. కాదా.. ఎంత లోన్ ఇవ్వొచ్చు అనేది బ్యాంక్ డిసైడ్ చేస్తుంది.
లోన్ మొత్తం, చెల్లింపు కాల వ్యవధి..
మీకు లోన్ ఇచ్చేందుకు బ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే.. మీ అవసరాల ఆధారంగా లోన్ ఎంత కావాలి.. పెమెంట్ వ్యవధిని ఎంచుకోవాలి.
అకౌంట్‌లోకి నిధులు..
దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తరువాత.. కొన్ని గంటల వ్యవధిలోనే మీ ఖాతాలో డబ్బు జమ అవుతుంది. ఒక్కోసారి డబ్బులు జమ కావడానికి గరిష్టంగా 24 గంటల సమయం పడుతుంది.
లోన్ పొందడానికి అర్హతలు..
వయసు: కనీసం వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. కొన్ని బ్యాంకులు దరఖాస్తుదారులకు కనీసం 21 సంవత్సరాల వయస్సును అర్హతగా పరిగణిస్తాయి.
సిబిల్ స్కోర్: మంచి సిబిల్ స్కోర్ ఉండాలి. చాలా మంది రుణదాతలు 700 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్ ఇచ్చేందుకు ఆసక్తి చూపుతారు. అంతేకాదు.. తక్కువ వడ్డీ రేటుతో లోన్ అందిస్తుంది.
ఇన్‌కమ్ సోర్స్: మీకు జీతం వస్తున్నట్లయితే.. ఆ కంపెనీలో కనీసం ఒక సంవత్సరం పాటు పని చేసి ఉండాలి. స్వయం ఉపాధి కలిగి ఉంటే.. స్థిరమైన ఆదాయ వనరును చూపించాల్సి ఉంటుంది.
ఇన్‌స్టాంట్ పర్సనల్ లోన్ ప్రయోజనాలు..
తాకట్టు పెట్టే పని లేదు: తక్షణ పర్సనల్ లోన్ ప్రధాన ప్రయోజనాల్లో కీలకమైంది ఏంటంటే.. ఎలాంటి తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు.
అవసరానికి చేతికందే డబ్బులు: అత్యవసరమైన సందర్భంలో ఇన్‌స్టాంట్ పర్సనల్ లోన్ చాలా ఉపయోగపడుతుంది. గంటల వ్యవధిలోనే అకౌంట్‌లో డబ్బులు జమ అవుతాయి.
ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్స్: మీ ఆర్థిక పరిస్థితి, సామర్థ్యం ఆధారంగా రీపేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. చాలా బ్యాంకులు రికవరీ ఛార్జీలు లేకుండానే రుణాన్ని ముందుగా చెల్లించేందుకు అనుమతిస్తాయి.
ఈజీ ప్రాసెస్: ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కారణంగా సుదీర్ఘ క్యూలలో నిలబడాల్సిన పని ఉండదు. పర్సనల్ లోన్ కోసం ఈజీగా అప్లై చేసుకోవచ్చు.
Also Read:
ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ సీఎం జగన్..
ప్రియాంక ర్యాలీలో రాహుల్ ఏం చేశారంటే
కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..
For More Business News and Telugu News..