POCO: పోకో మొబైల్‌లో న్యూ సిరీస్.. విడుదల ఎప్పుడంటే
ABN , Publish Date - Jan 05 , 2024 | 01:27 PM
ప్రపంచ మార్కెట్లో దిగ్గజ ఫోన్ కంపెనీలలో ఒకటైన పోకో బ్రాండ్ తన కొత్త సిరీస్ మొబైల్స్ ని త్వరలో అందుబాటులోకి తేనుంది. జనవరి 11న పోకో ఎక్స్ 6 సిరీస్ విడుదల చేయనున్నట్లు కంపెనీ యాజమాన్యం ప్రకటించింది.
ముంబయి: ప్రపంచ మార్కెట్లో దిగ్గజ ఫోన్ కంపెనీలలో ఒకటైన పోకో బ్రాండ్ తన కొత్త సిరీస్ మొబైల్స్ ని త్వరలో అందుబాటులోకి తేనుంది. జనవరి 11న పోకో ఎక్స్ 6 సిరీస్ విడుదల చేయనున్నట్లు కంపెనీ యాజమాన్యం ప్రకటించింది.
Poco X6 సిరీస్‌ను ఆ రోజు సాయంత్రం 5:30 గంటలకు భారత్ లో ఆవిష్కరించనున్నారు. Poco X6 Pro శక్తివంతమైన MediaTek Dimensity 8300 Ultra చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 12GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్ ప్రారంభ ధర రూ. 29,500గా నిర్ణయించారు.
ప్రో ఫీచర్లివే..
Poco X6 Pro 6.67-అంగుళాల 1.5K LTPS 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. MediaTek డైమెన్సిటీ 8300 Ultra SoC ఉంది. కెమెరా వారీగా, స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ సెటప్ కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ 2MP మాక్రో లెన్స్‌తో కూడిన 67MP ప్రైమరీ సెన్సార్, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో 5,000mAh బ్యాటరీ కలిగి ఉంది.
Poco X6లో...
పోకో ఎక్స్ 6 ప్రో తోపాటు లాంచ్ అవుతున్న Poco X6 సమర్థవంతమైన పనితీరు కోసం LPDDR5 RAM, UFS 3.1 స్టోరేజ్‌తో పాటు Qualcomm Snapdragon 7s Gen 2 SoC కలిగి ఉందని తెలుస్తోంది. కెమెరా ప్రకారం 64MP ప్రైమరీ సెన్సార్, 13MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP సెకండరీ సెన్సార్ తో పని చేస్తుంది. Poco తన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Poco C65ని భారత్ లో డిసెంబర్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ లు 4GB+128GB, 6GB+128GB, 8GB+256GB స్టోరేజీలతో అందుబాటులో ఉంటాయి. వీటి బేస్ మోడల్ ధర రూ.8,999 కాగా, టాప్-టైర్ వేరియంట్ ధర రూ.10,999గా ఉంది.