Share News

Viral Video: వధువు చేయి పట్టుకుని తీసుకొచ్చిన తండ్రి.. కన్నీరు పెట్టుకున్న రాధిక

ABN , Publish Date - Jul 13 , 2024 | 11:31 AM

ఏ ఆడపిల్ల తండ్రికైనా పెళ్లి బాధ్యతలు తప్పనిసరి అని చెప్పవచ్చు. అది రిచ్ అయినా, పూర్ అయినా కూడా తప్పదు. అదే క్రమంలో నిన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ(mukesh ambani), నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ(anant ambani), వీరేన్ మర్చంట్‌ల(viren merchant) కుమార్తె రాధికా మర్చంట్‌లకు(Radhika merchant) పెళ్లి జరిగింది. ఆ క్రమంలో రాధిక మర్చంట్ కన్నీరు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: వధువు చేయి పట్టుకుని తీసుకొచ్చిన తండ్రి.. కన్నీరు పెట్టుకున్న రాధిక
Radhika merchant emotional tears

ఏ ఆడపిల్ల తండ్రికైనా పెళ్లి బాధ్యతలు తప్పనిసరి అని చెప్పవచ్చు. అది రిచ్ అయినా, పూర్ అయినా కూడా తప్పదు. అదే క్రమంలో నిన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ(mukesh ambani), నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ(anant ambani), వీరేన్ మర్చంట్‌ల(viren merchant) కుమార్తె రాధికా మర్చంట్‌లకు(Radhika merchant) పెళ్లి జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ముందు రాధిక మర్చంట్ కన్నీరు పెట్టుకుని ఉద్వేగానికి గురయ్యారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


వాటిలోని ఓ వీడియోలో నవ వధువు రాధికను(Radhika merchant) ఆమె తండ్రి వీరేన్ మర్చంట్‌ చేయి పట్టుకుని తీసుకొచ్చారు. ఆ సమయంలో వారిపై పూల వర్షం కురిపించారు. తర్వాత ఫ్లవర్ బెడ్‌షీట్‌ గుండా ఆమెకు స్వాగతం పలికారు. ఆ క్రమంలోనే ఆమె నెమలి పల్లకిలో వచ్చింది. అప్పుడు రాధిక కన్నీరు పెట్టుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఆ సమయంలో ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు వచ్చాయి. రాధిక ఎంట్రీ సందర్భంగా శ్రేయా ఘోషల్ లైవ్‌లో పాటపాడారు. దీంతో రాధికా మర్చంట్ ఎంట్రీ ఎమోషనల్‌గా మారింది.


నెమలి పల్లకిలో వచ్చిన రాధికా మర్చంట్ ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. ఆమె ముఖంలో ఓవైపు చిరునవ్వు, ఆ తర్వాత కళ్ళ నుంచి కన్నీళ్లు వచ్చాయి. ఆ క్రమంలో అతిథులందరూ రాధికను నవ్వుతూ పలకరించారు. ఆ సమయంలో రాధిక కుటుంబం కూడా భావోద్వేగానికి లోనైంది. ఆ సమయంలో ఆమె సోదరి అంజలి మర్చంట్ కూడా రాధికతో కనిపించారు.

సాధారణంగా పెళ్లిలో వధువు తరఫు కుటుంబికులు అప్పగింతల సమయంలో యువతులు కన్నీరు పెట్టుకుంటారు. తల్లిదండ్రులను వదిలి వెళల్లేక వధువు కన్నీరు పెట్టుకోవడం చూస్తుంటాం. ఇక్కడ కూడా అచ్చం అలాగే జరిగిందని చెప్పవచ్చు. ఈ పెళ్లి వేడుక ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగగా, ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో భారతదేశం సహా విదేశాల నుంచి అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.


ఇది కూడా చదవండి:

Viral Video: అనంత్ పెళ్లి ఊరేగింపులో నీతా అంబానీతో కలిసి షారుఖ్, సల్మాన్ ఖాన్ డ్యాన్స్

Viral Video: అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి వేడుక


Warranty vs Guarantee: మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడా తెలుసా.. లేదంటే నష్టపోతారు జాగ్రత్త..!

For Latest News and Business News click here

Updated Date - Jul 13 , 2024 | 11:32 AM