Share News

Viral Video: అనంత్ పెళ్లి ఊరేగింపులో నీతా అంబానీతో కలిసి షారుఖ్, సల్మాన్ ఖాన్ డ్యాన్స్

ABN , Publish Date - Jul 13 , 2024 | 10:33 AM

ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అనంత్ అంబానీ(anant ambani), రాధిక మర్చంట్(radhika merchant) పెళ్లి వేడుకలు(wedding celebrations) నిన్న అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ క్రమంలో నీతా అంబానీతో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌ డ్యాన్స్ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Viral Video: అనంత్ పెళ్లి ఊరేగింపులో నీతా అంబానీతో కలిసి షారుఖ్, సల్మాన్ ఖాన్ డ్యాన్స్
Shah Rukh and Salman Khan dance with Nita Ambani

ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అనంత్ అంబానీ(anant ambani), రాధిక మర్చంట్(radhika merchant) పెళ్లి వేడుకలు(wedding celebrations) నిన్న అంగరంగ వైభవంగా జరిగాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు దేశ, విదేశాల నుంచి అనేక మంది ప్రముఖులు తరలివచ్చారు. ఇదే సమయంలో అనంత్ అంబానీ పెళ్లిలో బాలీవుడ్ ప్రముఖులు డ్యాన్స్ చేస్తూ అదరగొట్టారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ భార్య గౌరీతో కలసి పెళ్లికి వచ్చారు. మరోవైపు సల్మాన్ ఖాన్ కూడా తన సోదరి అర్పితతో కలిసి కనిపించారు.


ఆ క్రమంలో పెళ్లి ఊరేగింపులో భాగంగా నీతా అంబానీ ఫ్యామిలీతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించారు. అంతేకాదు నీతా అంబానీ షారుఖ్ ఖాన్‌(Shah Rukh khan)ను కౌగిలించుకుని డ్యాన్స్ చేశారు. ఆయన మెడ చుట్టూ చేయి వేసి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఆ క్రమంలో షారుఖ్ ఆమెతో కలిసి డ్యాన్స్ స్టెప్పులు వేశారు. అదే సమయంలో రణబీర్ కపూర్, అలియా భట్, కత్రినా కైఫ్ కూడా కలిసి నృత్యం చేశారు.


ఆ తర్వాత సల్మాన్(Salman Khan) కూడా సూపర్‌హిట్ చిత్రం 'కరణ్ అర్జున్'లోని ప్రసిద్ధ పాట భాంగ్రా పాటకు నీతాతో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీలకు ఇది చాలా ప్రత్యేకమైన సమయమని చెప్పవచ్చు. ఎందుకంటే వీరి ఇంట్లో ఇదే చివరి పెళ్లి కావడంతో గ్రాండ్ వేడుకలను ఏర్పాట్లు చేసి సంబరాల్లో మునిగిపోయారు. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న ఈ పెళ్లికి దేశ, విదేశాల నుంచి అనేక మంది అతిథులు తరలివచ్చారు.


జాన్ సెనా, అనిల్ కపూర్, అర్జున్ కపూర్, రణవీర్ సింగ్, అనంత్ అంబానీతో కలిసి జోరుగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


అనంత్ బారాత్‌కు హాజరైన చాలా మంది ప్రముఖులు నాన్‌స్టాప్ డ్యాన్స్ చేశారు. వీరిలో ప్రియాంక చోప్రా కూడా ఉన్నారు. ‘సప్నే మే మిల్తీ హై’, ‘చిక్నీ చమేలీ’ ట్యూన్‌లకు ఆమె డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇది చూసిన రణ్‌వీర్, తన చేతిని చాచి, నిక్‌ని డ్యాన్స్ మధ్యలోకి లాగి, ఆపై అతన్ని కౌగిలించుకున్నాడు.


ఇది కూడా చదవండి:

Viral Video: అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి వేడుక


Warranty vs Guarantee: మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడా తెలుసా.. లేదంటే నష్టపోతారు జాగ్రత్త..!

PSUs : పీఎస్‌యూలకు కాయకల్ప చికిత్స

For Latest News and Business News click here

Updated Date - Jul 13 , 2024 | 10:49 AM