RailTel Stock: ; దారుణంగా పడిపోయిన రైల్‌టెల్ స్టాక్..
ABN , Publish Date - Jul 23 , 2024 | 01:05 PM
కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టినప్పుడు కొన్ని స్టాక్స్ పరుగులు పెట్టడం.. కొన్ని స్టాక్స్ కుప్పకూలడం జరుగుతూనే ఉంటుంది. రైల్వే మంత్రిత్వ శాఖ (రైల్వే బోర్డు) నుంచి రూ. 187 కోట్ల ఆర్డర్‌ను పొందినట్టు..
ముంబై: కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టినప్పుడు కొన్ని స్టాక్స్ పరుగులు పెట్టడం.. కొన్ని స్టాక్స్ కుప్పకూలడం జరుగుతూనే ఉంటుంది. రైల్వే మంత్రిత్వ శాఖ (రైల్వే బోర్డు) నుంచి రూ. 187 కోట్ల ఆర్డర్‌ను పొందినట్టు రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (Railtel) సంస్థ ప్రకటించిన ఆ తర్వాత ఆ సంస్థకు చెందిన స్టాక్ పరుగందుకుంది. ఇంట్రాడేలో దాదాపు 5% ర్యాలీ చేసింది. మంగళవారం నాడు ఒక్కో షేరు ధర రూ.549.55 కు చేరుకుని ఇంట్రాడే గరిష్టానికి చేరుకున్నాయి.
సీన్ కట్ చేస్తే ఇవాళ బడ్జెట్ నేపథ్యంలో ఉదయం నుంచే చాలా సంస్థలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. వాటిలో రైల్ టెక్ కూడా ఒకటి. ఇవాళ ఉదయం అది మాంచి ఊపు మీదుంది. ఆ తరువాత కొద్ది సేపటికే పతనం వైపునకు ప్రయాణం సాగించింది. ప్రస్తుతం అంటే మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో 6.46 శాతానికి పడిపోయింది. డిజైన్, డెవలప్‌మెంట్, ఇంప్లిమెంటేషన్, ఆపరేషన్స్, మెయింటెనెన్స్ కోసం రైల్వే మంత్రిత్వ శాఖ (రైల్వే బోర్డు) నుంచి రైల్ టెక్ వర్క్ ఆర్డర్‌ను అందుకుంది. ఈ ఆర్డర్‌ను అందుకున్న వెంటనే షేర్ ధర పరుగులు తీయడంతో ఇన్వెస్టర్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. కానీ ఇవాళ ఉదయం తర్వాత క్రమక్రమంగా పతనమవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు.
భారతీయ రైల్వేల కోసం హెచ్ఎంఐఎస్, ఇంటిగ్రేటెడ్ ఎంపానెల్డ్ హాస్పిటల్ రిఫరల్ పోర్టల్ రూపకల్పన, అభివృద్ధి, అమలు, కార్యకలాపాలు, నిర్వహణకు రైల్‌టెల్ బాధ్యత వహిస్తుంది. అయితే ఈ ఆర్డర్‌ను 4 సంవత్సరాలు లేదా 48 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. రైల్‌టెల్ ఈ ఏడాది నాలుగవ త్రైమాసికంలో పన్ను తర్వాత లాభం (పిఎటి) గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 3 శాతం పెరిగి రూ.75.2 కోట్ల నుంచి రూ.77.5 కోట్లకు చేరింది. రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మినీ రత్న కంపెనీ 2023-24 చివరి త్రైమాసికంలో రూ. 852 కోట్ల మొత్తం ఆదాయాన్ని వెల్లడించింది. రైలు నియంత్రణ, భారతీయ రైల్వేల భద్రతా వ్యవస్థను ఆధునీకరించడానికి 2002లో రైల్‌టెల్ ఏర్పాటైంది. ఇది బ్రాడ్‌బ్యాండ్, వీపీఎన్ సేవలను అందించే భారతీయ ప్రభుత్వ రంగ సంస్థ.
ఇవి కూడా చదవండి:
Union Budget 2024: విద్యార్థులకు గుడ్ న్యూస్.. 10 లక్షల వరకు లోన్స్
Budget 2024: బడ్జెట్ 2024లో ముద్ర లోన్స్ రుణ పరిమితి రూ.20 లక్షలకు పెంపు
Budget 2024-25: బడ్జెట్ 2024-25ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Stock Market: బడ్జెట్ ఎఫెక్ట్.. ఆ షేర్లన్నీ ఢమాల్..
Read More Business News and Latest Telugu News