Share News

RBI: ఇకపై క్షణాల్లోనే లోన్స్.. గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ

ABN , Publish Date - Aug 26 , 2024 | 02:27 PM

భారతదేశంలో రిటైల్ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే డిజిటల్ విధానంలో సులభంగా రుణాలు ఇచ్చేందుకు ఆర్బీఐ ULI (యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్) పేరుతో ఓ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. ఇది మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా అమల్లోకి రానుందని గవర్నర్ తెలిపారు.

RBI: ఇకపై క్షణాల్లోనే లోన్స్.. గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ
RBI Governor Shaktikanta Das

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు సెకన్లలో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భారతదేశంలో రిటైల్ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే వచ్చిన UPI చెల్లింపు వ్యవస్థ విజయవంతమైంది. ఈ క్రమంలోనే ULI (యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్) పేరుతో డిజిటల్ విధానంలో సులభంగా రుణాలు ఇచ్చేందుకు RBI ఓ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. ఇది ప్రయోగాత్మక దశలో ఉందని, త్వరలో పూర్తి స్థాయిలో ప్రారంభించబడుతుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. బెంగుళూరులో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎమర్జింగ్ టెక్నాలజీస్‌కు సంబంధించిన కార్యక్రమంలో ప్రసంగించిన సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఈ మేరకు పేర్కొన్నారు.


అప్పుడు UPI.. ఇప్పుడు ULI

యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (ULI) సాంకేతిక ప్లాట్‌ఫారమ్ పైలట్ ప్రాజెక్ట్‌ను RBI నడుపుతున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ నేపథ్యంలో రుణ ఆమోదం వ్యవస్థ క్రమబద్ధీకరించబడుతుందని, తద్వారా చాలా తక్కువ సమయంలో ప్రజలకు రుణాలు ఇవ్వబడతాయన్నారు. తక్కువ మొత్తంలో రుణాలు తీసుకునే వారు దీని వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారని గవర్నర్ అన్నారు.

పైలట్ ప్రాజెక్ట్ తర్వాత యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (ULI)ని త్వరలో దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు ఆర్‌బిఐ గవర్నర్ తెలిపారు. ఇప్పటికే UPI చెల్లింపు వ్యవస్థ డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో పెద్ద మార్పు తీసుకురావడంలో విజయవంతమైందన్నారు. అదే విధంగా యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ కూడా భారతదేశంలో రుణాలు తీసుకునే విషయంలో కీలక మార్పును తీసుకువస్తుందన్నారు.


ప్రధానంగా వీరికి

ఈ ప్లాట్‌ఫారమ్‌లో బహుళ డేటా ప్రొవైడర్‌లతో పాటు రుణ సంస్థలు వివిధ రాష్ట్రాల భూ రికార్డులను కూడా కలిగి ఉంటాయన్నారు. దీని ద్వారా మరింత డిజిటల్ సమాచారం అందుబాటులో ఉంటుందని శక్తికాంత దాస్ చెప్పారు. దీంతో చిన్న, గ్రామీణ ప్రాంతాల వ్యక్తులకు తక్కువ సమయంలో సులభంగా రుణాలు ఇవ్వవచ్చన్నారు. ఈ వ్యవస్థ ద్వారా భారీ డాక్యుమెంటేషన్ నుంచి బయటపడతారని చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయం, ఎంఎస్‌ఎస్‌ఈ రంగానికి సంబంధించిన వ్యక్తులు రుణం తీసుకోవాలనుకునే వారికి మంచి ప్రయోజనం చేకూరుతుందన్నారు.


ఇవి కూడా చదవండి:

Stock Markets Today: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. కలిసొస్తున్న అంతర్జాతీయ పరిణామాలు

Lowest Interest Car Loans: తక్కువ రేటుకే లక్షల రూపాయల కార్ లోన్స్.. ఈ వివరాలు తెలుసా మీకు..


Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా..

Tourist Place: వీకెండ్ విజిట్‌కు బెస్ట్ ప్లేస్ .. ట్రేక్కింగ్, కాఫీ తోటలతోపాటు..


Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 26 , 2024 | 03:10 PM